విద్యార్థులకు వింత రూల్ పెట్టిన కాలిఫోర్నియా టీచర్..

ఇటీవల కాలంలో విద్యార్థులకు టీచర్లు పెడుతున్న రూల్స్ చాలామందికి షాక్‌లు ఇస్తున్నాయి.

కొంతమంది టీచర్లు చిన్నపిల్లలను కూడా చూడకుండా వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు మరికొందరు చండశాసనులుగా ప్రవర్తిస్తూ పిల్లలకు నరకం చూపిస్తున్నారు.

అలాంటి ఒక శాడిస్ట్ టీచర్( sadistic teacher ) ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక స్కూల్‌లో ఈమె పాఠాలు చెబుతుంది.

అయితే ఈ టీచర్ తన విద్యార్థులను ఎప్పుడూ కూడా క్లాస్ రూమ్ లోనే ఉండమని బలవంతం చేస్తుందట.వాళ్లు తరగతి గది నుంచి బయట అడుగుపెట్టి టాయిలెట్ కి కూడా వెళ్లకూడదట.

అలా చేస్తే అదనపు మార్కులు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చిందట.

Advertisement

ఈ విషయం తెలిసి ఒక తల్లి చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.ఆమె కూతురు ఆ టీచర్ క్లాస్‌లో చదువుతుంది.ఆ టీచర్ వారానికి ఒక్కసారి మాత్రమే టాయిలెట్ కి వెళ్ళడానికి అనుమతి ఇస్తారట.

ఇలా చేయకపోతే అదనపు మార్కులు ఇస్తారట.కూతురు మాత్రం ఇది చాలా కష్టమని చెబుతోంది.

టాయిలెట్ కి ( toilet )ఆపుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని ఆ చిన్నారి వాపోతోంది.ఆ తల్లి ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్‌కి తెలియజేయాలనుకుంటున్నారు.

కానీ, ఇలా చేయడం సరియైనదేనా అని ఆలోచిస్తున్నారు.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 1.6 కోట్ల వ్యూస్ వచ్చాయి.దీనిపై చాలా చర్చ జరిగింది.

Advertisement

మరొక తల్లి కూడా ఇలాంటి అనుభవమే జరిగిందని చెప్పింది.ఆమె కూతురి గణిత ఉపాధ్యాయుడు కూడా ఇలాగే చేస్తున్నారట.

ఆమె కూతురు కూడా తరగతి గదిలో చివరి 30 నిమిషాలు మూత్రం అదుపు చేసుకోవలసి వచ్చిందట.చాలా మంది ఈ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ఎందుకంటే, ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని వారు అంటున్నారు.టీచర్ లాగా ఉండి ఈ చిన్న విషయాన్నీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? అన్నీ తెలిసినా కఠినమైన శిక్షలు పెడుతూ పిల్లల్ని బాధిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు