త్వరలోనే స్టేషన్ ఘనపూర్ లో ఉపఎన్నిక.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న రెండు, మూడు నెలల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి( Station Ghanpur Constituency ) ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు వచ్చాయన్న పెద్ది సుదర్శన్ రెడ్డి రేపో మాపో కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) కూడా నోటీసులు రాబోతున్నాయని పేర్కొన్నారు.ఉద్యమకారులను పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు కడియం శ్రీహరి అని ఆరోపించారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.రాజకీయాల్లో ఇలాంటి ద్రోహి ఇంకెక్కడా ఉండరన్నారు.

కాంగ్రెస్ కు కూడా కడియం శ్రీహరి ద్రోహం చేస్తారని విమర్శించారు.ఈ నేపథ్యంలో కొండా సురేఖ, సీతక్క పదవులకు ముప్పు రాబోతుందని పేర్కొన్నారు.

Advertisement

అదేవిధంగా వరంగల్ నుంచే కాంగ్రెస్ లో చీలిక రాబోతుందని తెలిపారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు