విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీల బంపర్ ఆఫర్.. ఏకంగా ఏడాదికి రూ.50 కోట్లు..!

ఐపీఎల్ ( IPL )అంటే ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్.

( T20 League ) 2008 లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక ప్రపంచంలోని పెద్ద దేశాలు కూడా తమ తమ టీ20 లీగ్లను ప్రారంభించాయి.

ఈ ఐపీఎల్ 2023 లో దాదాపుగా 200 మందికి పైగా స్వదేశీ మరియు విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.ఈ ఐపీఎల్ లో పాల్గొని 10 జట్లకు దాదాపుగా 100 కోట్ల వరకు వేతనం ఇస్తున్నారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాలను కేవలం భారత్లోనే కాకుండా UAE, అమెరికా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ లలో జరిగే టీ20 లీగ్ లలో తమ జట్టను బరిలోకి దింపుతున్నాయి.ఐపీఎల్ ఫ్రాంచైజీలు( IPL franchises ) కేవలం ఒక టోర్నమెంట్ కోసం మాత్రమే ఆటగాళ్లను పరిమితం చేయకుండా మిగతా లీగ్లలో కూడా ఆడించాలని భావిస్తున్నాయి.

ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్లతో వార్షిక ఒప్పందాలు చేసుకోవాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయని సమాచారం.స్టార్ ఆటగాళ్లతో ఒప్పందం కుదిరితే ఏడాదికి గరిష్టంగా రూ.50 కోట్ల పారితోషకం ఇవ్వనున్నారు.FICA నివేదిక ప్రకారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు ఆఫర్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

అయితే అన్నీ బోర్డులు కలిసి ద్వైపాక్షిగా సిరిస్ ల షెడ్యూల్ లో టీ 20 లీగ్ చేర్చాలని FICA ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హీత్ మిల్స్ అభిప్రాయపడ్డారు. T20 లీగ్ కోసం సంవత్సరంలో రెండు లేదా మూడు విండోలను తయారు చేయవచ్చు.

ఇప్పటికే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టును విడిచిపెట్టారు.రానున్న కాలంలో చాలామంది కాంట్రాక్టును విడిచిపెట్టె అవకాశాలు ఉన్నాయి.కాబట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాడి తో గరిష్టంగా ఏడు నెలల పాటు ఒప్పందం చేసుకుంటే.

మిగిలిన సమయంలో ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచులు ఆడెందుకు అవకాశం ఉంటుంది.భవిష్యత్తు కాలంలో ఐపీఎల్ మూడు నెలల పాటు జరిగే అవకాశం ఉంటుంది.

ఈ నిర్ణయాలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.చర్చల అనంతరం అసలు విషయాలు వెల్లడవుతాయి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు