ఏజెంట్ హిట్టైతే మాత్రమే సురేందర్ రెడ్డికి కొత్త ఆఫర్లు వస్తాయా.. పాపం అంటూ?

ఏజెంట్( agent ) మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు చేరింది.స్టార్ హీరోల సినిమాలను మించిన బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఆ రేంజ్ లో కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది అయితే ఏజెంట్ సినిమాకు సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకుడు అనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సురేందర్ రెడ్డి సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి.

 Surender Reddy Career Depends On Agent Movie Details Here Goes Viral , Surender-TeluguStop.com

ఏజెంట్ సినిమా అఖిల్( Akhil ), సురేందర్ రెడ్డిలకు టెస్టింగ్ మూవీ అని ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే వీళ్లిద్దరి కెరీర్ పుంజుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏజెంట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.

అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.నిర్మాత సైతం ఈ సినిమాను ఒకింత నష్టానికే విడుదల చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్లు సైతం ఆలస్యం అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సురేందర్ రెడ్డికి కొత్త ఛాన్స్ లు రావాలంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించాల్సి ఉంది.

వక్కంతం వంశీ( Vakkantam Vamsi ) ఈ సినిమాకు కథ అందించారు.సురేందర్ రెడ్డి ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో లేక టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తారో చూడాల్సి ఉంది.

ఏజెంట్ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నా ఆక్యుపెన్సీ ఆశించిన రేంజ్ లో లేదు.సురేందర్ రెడ్డికి ఈ సినిమాతో ఎలాంటి ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఏజెంట్ సినిమా చాలామంది తలరాతలను డిసైడ్ చేయనుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube