బీటెక్ వాలా బిజినెస్ ఐడియా... రు.1తో 10 రూపాయల లాభం!

బేసిగ్గా బీటెక్ పూర్తైన తరువాత ఏ విద్యార్థినైనా నెక్ట్స్‌ ఏంటి? అని అడిగితే, ఏదో వుద్యోగం తెచ్చుకోవాలి అని సమాధానం చెబుతారు.

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌కు వున్న బూమ్ అంతాఇంతా కాదు.

వారానికి రెండు రోజులు సెలవులు, ఐదంకెల జీతం ఎవరికి అక్కర్లేదు.కానీ వారు మాత్రం అలా ఓ వుద్యోగం కోసం ఎదురు చూడలేదు.

కొత్తగా ఏదన్నా ట్రై చేయాలని అనుకున్నారు.ఓ రకంగా కరోనా వారికి సహాయపడిందనే చెప్పుకోవాలి.

అవును.కరోనానే వారి జీవితాన్ని మార్చివేసింది.

Advertisement

కరోనా కష్టకాలంలో వుద్యోగం కంటే వ్యాపారమే బెస్ట్ అని అనుకున్నారు.అప్పుడే వాళ్లకో ఐడియా వచ్చింది.

ఇప్పుడదే లక్షల ఆదాయం తెచ్చిపెడుతుంది.వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లాకి చెందిన రాపర్తి రామకృష్ణ, మనోజ్.

బీటెక్ వాలా అనే ఓ పానీ పూరి స్టాల్‌ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసారు.సొంత ఊరిలోనే వుంటూ ఏదో ఒక పని చేసుకోవాలని ఆలోచించారు.

అందరికీ సులభంగా, ముఖ్యంగా స్టూడెంట్స్‌ ని అట్రాక్ట్‌ చేసేందుకు వారి పానీపూరి వ్యాపారానికి బీటెక్ వాలాఅని పేరు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు.పెట్టుబడి పెట్టేందుకు వారి దగ్గరున్న స్టైఫండ్‌, కొంతమొత్తంలో ఇంటి దగ్గర తల్లిదండ్రుల వద్ద తీసుకొని ఒక లక్ష యాబై వేల రూపాయలతో మొదటి పెట్టుబడి పెట్టి ప్రారంభించారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

ఐడియా సూపర్ సక్సెస్.సంవత్సరం కాకుండానే సమిష్టిగా లాభాలు అర్జిస్తున్నారు.పానీపూరి వీరి వద్ద అనేకరకాల ఫ్లేవర్స్ లో దొరుకుతుంది.

Advertisement

పుదీనా, జీర వెల్లుల్లి, ఇంగివా, స్వీట్ పానీ పూరి వంటి రకాలను నగరవాసులకు అందిస్తూ అతి తక్కువ రోజుల్లోనే ఫేమస్ అయ్యారు.ఫుణేలో ఒకసారి ఇలానే డిఫరెంట్‌ ఫ్లేవర్స్‌ చూసిన రామకృష్ణ మన సౌత్‌ ఇండియన్స్‌ కు నచ్చేలా కొన్ని మార్పులు చేర్పులు చేశామంటున్నాడు.

వైజాగ్‌లో పెట్టిన మొట్టమొదటి స్టాల్‌ సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రతి జిల్లాకు తమ బ్రాండ్‌ను విస్తరింపజేసే దిశగా యువకులు అడుగులేస్తున్నారు.

తాజా వార్తలు