Telangana:బీఆర్ఎస్ న్యూ మేనిఫెస్టో..ఈ 4 స్కీమ్స్ కీలకం కాబోతున్నాయా..?

ఇంకో వారంలో రాష్ట్రంలో ఎన్నికల జంగ్ సైరన్ మోగబోతోంది.

దీంతో అన్ని పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు పట్టణాల నుండి గ్రామాల వైపు పరుగులు పెడుతున్నారు.

ఐదు సంవత్సరాల నుండి కనీసం ఎవరికి కనిపించని వారు, గ్రామాల్లో తిరుగుతూ రకరకాల స్టంట్ లు చేస్తూ, ప్రజా మన్ననలు పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.ఈసారి అధికార బీఆర్ఎస్( BRS ) మరియు కాంగ్రెస్( Congress ) మధ్య ఎక్కువ పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బిజెపి( Bjp ) మూడవ స్థానంలో ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.ఇప్పటికే అధికార బిఆర్ఎస్ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దింపింది.

ఇదే తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు కానీ, 6 గ్యారంటీ స్కీములతో ప్రజల్లో ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే అధికార బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ దెబ్బ కొడుతుందనే ఆలోచన, కాంగ్రెస్ పెట్టిన కొత్త స్కీములు( new schemes ) ప్రజలను ఆకర్షించేలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన పుట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

దీంతో కేసీఆర్( CM kcr ) సరికొత్త వ్యూహం రచించి, రాబోవు ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు కంటిన్యూ చేయడమే కాకుండా, మరో మూడు నుంచి నాలుగు కొత్త పథకాలు తీసుకురాబోతున్నారట.

ఈ పథకాలతో ప్రజల ఓట్లన్నీ బీఆర్ఎస్వైపు మళ్లేలా వ్యూహాలు రచించబోతున్నట్టు తెలుస్తోంది.ఈనెల 16వ తేదీన వరంగల్( Warangal ) బహిరంగ సభలో ఈ కొత్త మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులను ఆకట్టుకునేటువంటి పథకాలే ఉండబోతున్నాయట.

ఏం చేర్చబోతున్నారయ్యా అంటే .

సంవత్సరానికి 6 ఫ్రీ సిలిండర్లు , ఇప్పటికే ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల డబ్బులను పెంచడం, అంతేకాకుండా 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పైబడిన రైతులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఉచిత ఎరువులు, అంతేకాకుండా ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల సాయం అందించడం, అంతేకాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా, వారికి ఆహారం అందించడం వంటి పథకాలను ఈ మేనిఫెస్టోలో కీలకంగా తీసుకోనుందని తెలుస్తోంది.ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల వైపు ప్రజలు చూడకుండా సరికొత్త అంశాలతో కొత్త మేనిఫెస్టో( Manifesto ) ఈ నెల 16వ తేదీన వరంగల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు