కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది.బీఆర్ఎస్ టికెట్ల ప్రకటన తర్వాత చాలామంది నాయకులు అసంతృప్తి కి గురయ్యారు.

మరి కొంతమంది అలక చెందారు.ఇంకొంతమంది పార్టీ మారారు.

అయితే కొంతమందికి వివిధ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడంతో సంతృప్తి చెందగా,  మరి కొంతమంది ఇంకా ఆసంతృప్తితోనే రగులుతున్నారు.కాంగ్రెస్,  బిజెపిలలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్లను దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేటాయించినా,  కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పించారు .మరి కొన్ని చోట్ల ఎవరికి ఇంకా సీటును ప్రకటించలేదు.తాజాగా బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య( Tadikonda rajayya ) చాలా రోజులుగా అసంతృప్తితో ఉంటున్నారు.

Advertisement

అక్కడ రాజయ్యను తప్పించి కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) కేసీఆర్( Cm KCR ) అవకాశం ఇవ్వడంతో,  రాజయ్య పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఓ వేదికలో కన్నీళ్లు పెట్టుకున్నారు.కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట.దీనికి మరింత బలం చేకూరుస్తూ,  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజా నరసింహతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు.

హనుమకొండలోని హోటల్లో ఇద్దరు నేతలు కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల పైన చర్చించారు.అదే సమయంలో కాంగ్రెస్ లోని టిక్కెట్ల వ్యవహారం పైన రాజయ్య ఆరా తీసినట్లు సమాచారం.

 హనుమకొండలో దళిత మేధావుల సదస్సు నిర్వహించేందుకు దామోదర రాజనర్సింహ( Damodar raja narasimha ) అక్కడికి వెళ్ళగా , ఇదే సదస్సుకు ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య కూడా హాజరయ్యారు .కాంగ్రెస్ నేతతో రాజయ్య కలిసి మాట్లాడడంతో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారనే దానికి మరింత బలం చేకూరింది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే రాజయ్యను బుద్ధిగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఏ రకమైన బుజ్జగింపులకు దిగుతుందో చూడాలి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
రాజ్యసభకు సుహాసిని ? చంద్రబాబు వ్యూహం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు