పండుగ చేసుకుంటున్న  బీఆర్ఎస్ అసంతృప్తులు !

కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్( CM kcr ) ప్రకటించారు .

దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యే ల్లో కొంతమంది మినహా మిగిలిన వారందరికీ టిక్కెట్లు కేటాయించడంతో, టికెట్లు దక్కని వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

అలాగే టికెట్ పై ఆశలు పెట్టుకుని గతంలో కేసీఆర్ నుంచి హామీ పొందిన వారు, ఇతర పార్టీల నుంచి టికెట్ హామీతో బీఆర్ఎస్ లో చేరిన వారికి కేసీఆర్ మొండిచేయి చూపించడంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురై పార్టీపై పదేపదే విమర్శలు చేస్తున్నారు .కొంతమంది ఇప్పటికే పార్టీ మారిపోగా,  మరి కొంతమంది పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో వీరంతా  రెబల్ గా పోటీ చేయడమో లేక,  బీఆర్ఎస్( BRS ) లోనే ఉంటూ పార్టీ అభ్యర్థి ఓటమికి పావులు కదుపుతారు అనే భయము పార్టీ అధినేత కేసీఆర్ లో నెలకొందిc

మొదట్లో అసంతృప్త నాయకుల హెచ్చరికలను పట్టించుకోనట్టుగా వ్యవహరించినా,  వారి కారణంగా కొన్ని సీట్లు కూడా పోగొట్టుకునేందుకు కేసీఆర్ ఇష్టపడడం లేదు.అందుకే అసంతృప్తి నాయకులను పిలిచి బుజ్జగించడంతో పాటు,  కొంతమందికి నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఇదే విధంగా వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురవగా , ఆయనకు క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు .అదేవిధంగా మరికొంతమందికి కీలక పదవులు ఇస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు .తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు చైర్మన్ లు,  ఓ కార్పొరేషన్ వైస్ చైర్మన్ నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ( Muttireddy yadagiri Reddy )రెడ్డి , తాటికొండ రాజయ్యకు కీలక పదవులు లభించాయి.

అలాగే ఇటీవల పార్టీలో చేరిన వెంకటేష్ , నందికంటి శ్రీధర్( Nandhikanti Sridhar ) కు పదవులు దక్కాయి .జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్గా ఉప్పల వెంకటేష్ గుప్తా మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నందికంటి శ్రీధర్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా కెసిఆర్ నియమించారు.ఈ విధంగా అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు కేటాయించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో తమకు ఇబ్బంది ఉండదని లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.

Advertisement
Advertisement

తాజా వార్తలు