అన్ స్టాపబుల్ 3 మొదలయ్యేది అప్పుడే... ఫస్ట్ గెస్ట్లుగా భగవంత్ కేసరి టీమ్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలయ్య తనలో నటుడు మాత్రమే కాదు మంచి వ్యాఖ్యాత కూడా దాగి ఉన్నారంటూ ఈయన అన్ స్టాపబుల్ ( Unstoppable ) అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Crazy Update Goes Viral About Balayya Unstoppable Season 3, Balakrishna, Unstopp-TeluguStop.com

ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విపరీతమైనటువంటి క్రేజ్ లభించింది.ఇలా మొదటి సీజన్ ఎంతో మంచి సక్సెస్ అందుకోగా వెంటనే రెండవ సీజన్ కూడా ప్రారంభించారు .అయితే మొదటి సీజన్లో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించారు.ఇక రెండవ సీజన్లో సినిమా సెలబ్రెటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే.

Telugu Balakrishna, Dasara, Telugu Show, Unstoppable-Movie

ఇక మూడవ సీజన్ కూడా ఇప్పటికే ప్రసారం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అన్ స్టాపబుల్ 3 కోసం బాలయ్య రంగంలోకి దిగారని ఈ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని తెలుస్తుంది.త్వరలోనే బాలకృష్ణ ఈ సీజన్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.ఇలా సీజన్ 3 గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ దసరా ( Dasara ) పండుగ సందర్భంగా ప్రసారం చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu Balakrishna, Dasara, Telugu Show, Unstoppable-Movie

ఇక ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా సినిమా సెలబ్రిటీలను వేదికపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తుంది.అయితే ఈ సీజన్లో రాంచరణ్ తో పాటు చిరంజీవి అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇక మొదటి ఎపిసోడ్ లో భాగంగా అన్ స్టాపబుల్ 3 కార్యక్రమానికి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )టీమ్ నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) అలాగే శ్రీ లీల ( Sreeleela ) హాజరు కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఈ కార్యక్రమం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube