5జీతో కరోనాకి లింక్ అంటూ టవర్లు ద్వంసం... వదంతులపై సీరియస్

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే.

ఇలాంటి సమయంలో కొంత మంది మూర్ఖులు, ఆకతాయిలు వాట్స్ యాప్ గ్రూప్స్ లో, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు.

అనవసరమైన వదంతులు వ్యాపించి ప్రజలని మరింత భయాందోళనకి గురి చేస్తూ ఉంటారు.ఇండియాలో కోడి వలన కరోనా వస్తుందని వదంతి కారణంగా మొత్తం కోళ్ళ పరిశ్రమ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది.

అయితే ప్రభుత్వాలు దీనిపై మరల క్లారిటీ ఇవ్వడంతో ప్రజలు కూడా మారారు.ఇప్పుడు అలాంటి ఓ పుకారు బ్రిటన్ లో ఒక ప్రాంతంలో వ్యాపించింది.దీంతో అక్కడి ప్రజలు మొబైల్ టవర్లని ద్వంసం చేశారు.5జీ మొబైల్ కమ్యూనికేషన్స్, కరోనా వైరస్ కూ సంబంధముందని, 5జీ స్మార్ట్ ఫోన్ల తరంగాల ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ప్రచారం జరిగింది.దీంతో బర్మింగ్ హోమ్ ప్రాంతంలో మెర్సీసైడ్ ఏరియాలో ప్రజలు మొబైల్ టవర్లని ద్వంసం చేశారు.

దీంతో మొబైల్ కమ్యునికేషన్ సంస్థలు ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పే ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మలేదు.దీంతో వారందరూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.వెంటనే బ్రిటన్ మంత్రి మైఖేల్ గొవ్ రంగంలోకి దిగి దీనిపై క్లారిటీ ఇచ్చారు.మొబైల్ రేడియేషన్ ద్వారా కరోనా వ్యాపిస్తుంది అనేది అసత్య ప్రచారం అని ఇందులో వాస్తవం లేదని తెలిపారు.5జీ తరంగాలకి కరోనా వ్యాప్తికి అసలు సంబంధం లేదని ప్రకటించారు.ఇలాంటి తప్పుడు వార్తలని ప్రజలు విశ్వసించవద్దని కోరారు.

Advertisement

ఈ ప్రకటన తర్వాత ప్రజలు కొంత శాంతించారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు