భారత్‌కు 7 ప్రాచీన కళాఖండాలు అప్పగించిన యూకే.. అందులో 14వ శతాబ్ధపు ఖడ్గం

భారతీయ సంపద. విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోన్న సంగతి తెలిసిందే.

అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు కొందరి కృషి ఫలితంగా ఆ అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.తాజాగా ఏడు ప్రాచీన కళాఖండాలను బ్రిటన్ మ్యూజియం భారత్‌కు అప్పగించింది.

ఇందులో 14వ శతాబ్ధం నాటి ఇండో పర్షియన్ ఖడ్గం కూడా వుంది.దీనికి సంబంధించి గ్లాస్గో కేంద్రంగా పనిచేస్తోన్న మ్యూజియం.

భారత ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసింది.యూకే మ్యూజియంలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

Advertisement

గ్లాస్గో లైఫ్స్ మ్యూజియమ్స్ ప్రకటన ప్రకారం.శుక్రవారం భారత హైకమీషన్ అధికారుల సమక్షంలో యాజమాన్య హక్కుల బదిలీ జరిగింది.

కెల్వింగ్‌రోవ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియంలో జరిగిన సమావేశం తర్వాత.భారత ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు గ్లాస్గో మ్యూజియమ్స్ రిసోర్స్ సెంటర్‌లో వస్తువులను సురక్షితంగా భద్రపరిచే అవకాశం కల్పించారు.

గ్లాస్గో సిటీ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఏప్రిల్‌లో క్రాస్ పార్టీ వర్కింగ్ గ్రూప్ ఫర్ రీపాట్రియేషన్ అండ్ స్ఫోలియేషన్ ద్వారా 51 వస్తువులను భారతదేశం, నైజీరియా, చెయేన్ నది, పైన్ రిడ్జ్ లకోటా సియోక్స్ తెగలకు తిరిగి ఇవ్వడానికి చేసిన సిఫార్సును ఆమోదించిన తర్వాత యాజమాన్యపు హక్కుల బదిలీ కార్యక్రమం జరిగింది.

గ్లాస్గో లైఫ్ మ్యూజియంలు జనవరి 2021 నుంచి లండన్‌లోని హైకమీషన్ ఆఫ్ ఇండియాతో పాటు భారతీయ కళాఖండాలను స్వదేశానికి రప్పించే పనిలో వున్నాయి.ఇక్కడి పురాతన వస్తువులలో ఇండో పర్షియన్ కత్తి కూడా వుంది.ఇది 14వ శతాబ్ధానికి చెందినదని చరిత్రకారుల నమ్మకం.19వ శతాబ్ధంలో ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల నుంచి ఆరు వస్తువులు దొంగిలించబడ్డాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ ఒప్పందంపై సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత తాత్కాలిక హైకమీషనర్ సుజిత్ హోష్.ఈ కళాఖండాలు భారతదేశ వారసత్వంలో అంతర్భాగమని.వీటిని త్వరలోనే స్వదేశానికి తిరిగి పంపిస్తామని సుజిత్ తెలిపారు.

Advertisement

దీనిని సుసాధ్యం చేసిన గ్లాస్గో లైఫ్, గ్లాస్గో సిటీ కౌన్సిల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు