రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కల్లోలం సృష్టించింది.చెన్నై – హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు కాల్ చేసిన వ్యక్తి విమానాశ్రయంలోనే ఉన్నట్లు గుర్తించారు.కాగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి చెన్నైలో సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్యగా గుర్తించారు.
ఫ్లైట్ జర్నీకి లేటుగా రావడంతో భద్రయ్యను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు.దీంతో బెదిరింపు కాల్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ క్రమంలో అజ్మీరా భద్రయ్యను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







