ఇకపై ఒలంపిక్స్ లో ఓ ఆటగా బ్రేక్ డాన్స్..!

ఒలంపిక్స్ చరిత్రలో మరో కొత్త ఆట చేరింది.ఒలంపిక్స్ గేమ్స్ లో ఇకపై బ్రేక్ డాన్స్ కూడా ఓ అధికారిగా ఆటగా చేరిపోయింది.

ఈ సారి అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ మామూలు ఆలోచనలకు భిన్నంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు డాన్స్ పై ఉన్న మక్కువను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎందరో ప్రపంచ వ్యాప్తంగా వారి టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.అందుకే కాబోలు అనేక కోట్ల మంది అభిమానాన్ని ఆదరణ పొందుతున్న బ్రేక్ డాన్సింగ్ స్పోర్ట్స్ గుర్తింపు ఇస్తూ పారిస్ లో జరగబోయే 2024 ఒలంపిక్స్ లో ఈ ఆటను మొదలు పెట్టబోతున్నారు.

ఈ సంవత్సరం జరగబోయే ఒలంపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడగా, 2024లో ప్యారిస్ లో జరగబోయే ఒలింపిక్స్ నుండి ఈ ఆటను చూడబోతున్నాం.ఇంకా 2024 ఒలింపిక్స్ మొదలు పెట్టడానికి పూర్తిగా మూడు సంవత్సరాల సమయం ఉంది.

Advertisement

కాబట్టి, అంతవరకు టాలెంట్ ఉన్న వారు బాగా ప్రిపేర్ అయ్యి ప్రపంచం లో ఉన్న అందరిని మైమరిపించే విధంగా డాన్స్ చేయడానికి సిద్ధం అయిపోండి.ఇందులో భాగంగానే 2021 ఒక సంవత్సరం లో జరగబోయే ఒలంపిక్స్ లో స్కేట్ బోర్డింగ్ సర్ఫింగ్, స్పోర్ట్ క్లైమ్బింగ్ లాంటివి కూడా చేరబోతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలియజేసింది.

ఇకపోతే ఈ మూడు ఈవెంట్స్ జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరగబోయే ఒలంపిక్స్ నుండే మొదలు కాబోతున్నాయి.ఈ సంవత్సరం జరగాల్సిన ఒలంపిక్ ఆటలు కరోనా వైరస్ కారణంగా 2021లో జూలై 23 కి వాయిదా పడ్డాయి.

అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2024లో ఎలా ఉంటాయో తెలియచేయాలని కోరగా తద్వారా వారు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా.అందుకు సంబంధించి 2021, 2024 ఆటల గురించి కూడా వివరాలను తెలిపింది.

ఇక ఒలంపిక్ ఆటల్లో బ్రేక్ డాన్స్ ఈవెంట్లను బ్రేకింగ్ అని పిలవబడుతుంది.పేరు ఏదైనా సరే కానీ టైం ఉంటే చాలు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?

అవార్డుతో పాటు రివార్డు కూడా మీకే.

Advertisement

తాజా వార్తలు