సరైనోడు చిత్రం నుంచి నైజాంలో బెనిఫిట్ షోలకి పర్మిషన్ సరిగా ఇవ్వట్లేదన్న విషయం తెలిసిందే.అందుకే ఆ చిత్రానికి నైజాంలో బెనిఫిట్ షోలు పడలేదు.
ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.బెనిఫిట్ షోలకి పర్మిషన్ కష్టం అవుతున్న తరుణంలో మాస్టర్ ప్లాన్ వేశాడు మహేష్ బాబు.
బ్రహ్మోత్సవం విడుదలవుతున్న రోజు, అంటే మే 20న, తెలంగాణలోని ప్రతి సింగల్ స్క్రీన్ థియేటర్లో ( హైదరాబాద్ + మిగితా జిల్లాలు) నాలుగు కాదు అయిదు షోలు ఉంటాయి.ఉదయం 8:10 నిమిషాలకు మొదటి ఆట మొదలువుతుంది.ఆ తరువాత యథావిధిగా మిగితా షోలు ప్రదర్శితమవుతాయి.అయితే ఇది కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే.
మల్టిప్లేక్స్ లో ఎప్పటిలాగే, వీలుని బట్టి షోలు ఉంటాయి.ఇప్పుడు బెనిఫిట్ షోలకి పర్మిషన్ రాకపోయినా, ఉదయం పెట్టిన ఆటలు ఆ తాలూకు కలెక్షన్ సంపాదించి పెడతాయి.
ఎలా ఉందండి మన సూపర్ స్టార్ ప్లాన్ !







