కేరళలో తొలిసారి గవర్నర్ ఓటు

మన దేశంలో చదువుకోని వారే కాకుండా చదువుకున్న వారు కూడా ఓటు వేయరు.కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు తాము జీవితంలో ఏనాడూ ఓటు వేయలేదని గర్వంగా చెప్పుకుంటారు.

 In A First, Kerala Governor Casts His Vote-TeluguStop.com

ఇది గొప్పతనం కాదు.సిగ్గు పడాల్సిన విషయం.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉపయోగించుకోవడం కనీస బాధ్యత అనే విషయం రాజ్యంగ పదవుల్లో ఉండేవారు కూడా గుర్తించడంలేదు.

కేరళలో గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దీంతో ఇది ఆశ్చర్యకరమైన పెద్ద వార్త అయింది.కేరళ గవర్నర్, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సదాశివన్ ఈ రోజు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆయన అధికార నివాసానికి దగ్గరలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఓటు వేయడం తన బాధ్యత అని సదాశివమ్ అన్నారు.

ఈ నెల ప్రారంభంలో ఆయన ఓటరుగా నమోదు చేయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube