ఈ ఏడాది భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు చరణ్, తారక్ ల నటనకు ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ప్రశంసలు రావడానికి కారణమైంది.
అయితే మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న బ్రహ్మాస్త్ర సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన ఒక రికార్డ్ ను బ్రేక్ చేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.
ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తెస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లక్షన్నర టికెట్లు అమ్ముడవగా బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ కు మాత్రం ఏకంగా 1,70,000 టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ విధంగా బ్రహ్మాస్త్ర మూవీ ఆర్ఆర్ఆర్ ను దాటేసింది.
అయితే కేజీఎఫ్ ఛాప్టర్2 క్రియేట్ చేసిన రికార్డును మాత్రం ఈ సినిమా బ్రేక్ చేయడం కష్టమని తెలుస్తోంది.కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 4.35 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. భూల్ భూలయ్యా2 సినిమాకు మాత్రం కేవలం 1,30,000 టికెట్లు అమ్ముడయ్యాయి.సినిమా రిలీజయ్యే సమాయానికి బ్రహ్మాస్త్ర బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు చేశారు.

బ్రహ్మాస్త్ర సక్సెస్ సాధించాలని నాగార్జున అభిమానులు సైతం కోరుకుంటున్నారు.నాగార్జున ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ సినిమాతో నాగార్జున ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.







