Director Subbu Srikanth Kavuturi: బోయపాటి శ్రీను అసోసియేట్ సుబ్బు కొత్త చిత్రం !!!

కొత్త దర్శకులు మంచి కాన్సెప్ట్స్ తో వచ్చి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు.

అదే కోవలోకి నూతన దర్శకుడు సుబ్బు ఒక సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర పలు సినిమాలకు దర్శకత్వం శాఖలో పనిచేసిన సుబ్బు కొత్త హీరో శ్రీకాంత్ కవుటూరి తో సినిమా చేయబోతున్నారు.త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏ.ఎన్.రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.శ్రీకాంత్ కవుటూరి లుక్ , బాడీ లాంగ్వేజ్ ఈ కథకు కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకుడు సుబ్బు ఈ మూవీకి శ్రీకాంత్ కవుటూరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.

ప్రీ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతోంది.స్టైలిష్ లవ్ అండ్ యాక్షన్ సినిమాగా తెరకర్కబోతున్న ఈ సినిమాలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించబోతున్నారు.

అలాగే టైటిల్ ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

Advertisement
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు