బాక్సర్ విజయేందర్ సింగ్ ( Vijayender Singh )కాంగ్రెస్ షాక్ ఇచ్చారు.ఆ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు.ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ( Vinod Tawde )సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.2019లో దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయేందర్ సింగ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విజయేందర్ సింగ్ కు మథుర టికెట్ ఇచ్చింది.అయితే అనూహ్యంగా విజయేందర్ సింగ్ బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని తెలుస్తోంది.
అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయేందర్ పోటీ చేస్తారా? లేదా ? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.