కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) అంటే తమిళ తంబీలకు మక్కువ ఎక్కువ.ఆ మక్కువతోనే కొంతమంది అభిమానులు కొన్ని చోట్ల ఆమెకి గుడులు నిర్మించారు.
ఇక హీరోయిన్లకు గుడులు కట్టడం అక్కడ షరా మామ్మూలే.ఆమె దాదాపుగా అక్కడే సినిమాలు చేస్తుంది.
అడపాదడపా ఇతర భాషలు అయినటువంటి తెలుగు, కన్నడ సినిమాలలో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది.ఇక్కడ ఆమె చేసే సినిమాలు దాదాపుగా స్టార్ హీరోల సినిమాలే.
ఒకవైపు, జూనియర్లతో… మరోవైపు సీనియర్లతో ఆమె సినిమాలు చేస్తూ ఆకాశమంత ఎత్తులో వుంది అనడంలో సందేహమే లేదు.
![Telugu Maa, Artist, Murali Mohan, Nayanathara, Tollywood, Maa Nayanathara-Telugu Telugu Maa, Artist, Murali Mohan, Nayanathara, Tollywood, Maa Nayanathara-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Why-maa-association-fined-nayanatharac.jpg)
ఒకానొక సమయంలో నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ అప్పటి టాలీవుడ్ హీరోయిన్లకు( Tollywood heroines ) చెక్ పెట్టింది కూడా.వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ లను అందుకుంది నయనతార.ఈ క్రమంలోనే, అనగా నాగార్జునతో చేసిన ‘బాస్’ సినిమా సమయంలో టాలీవుడ్ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’( Movie Artist Association ) (మా)లో తన మెంబర్ కాదనే ఉద్దేశ్యంతో తనను సినిమాలో తీసుకోకూడదని అప్పటి ‘మా’ ప్రెసిడెంట్ అయిన మురళీమోహన్( Murali Mohan ) భావించారట.
విషయం ఏమిటంటే.మా అసోసియేషన్ లో కార్డు తీసుకున్న వాళ్ళని సినిమాల్లో తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.
![Telugu Maa, Artist, Murali Mohan, Nayanathara, Tollywood, Maa Nayanathara-Telugu Telugu Maa, Artist, Murali Mohan, Nayanathara, Tollywood, Maa Nayanathara-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Why-maa-association-fined-nayanatharad.jpg)
అప్పటికి ఆమె మా అసోసియేషన్లో కార్డు తీసుకోకుండానే నటించడం మొదలు పెట్టిందట.కాబట్టి ఆమె మీద ఫైన్ వేశారట.అయితే ఆ ఫైన్ తను చెల్లించను అని నయనతార బెట్టు చేసిందట.దాంతో ఆమె తెలుగు సినిమాల్లో నటించడానికి వీల్లేదు అంటూ మా అసోసియేషన్ ఒక రూల్ పాస్ చేసింది.
ఆ సమయంలో నాగార్జునే మధ్యవర్తిగా వ్యవహరించి నయనతార ను ఒప్పించి తనచేత ఆ ఫైన్ మొత్తం కట్టించాడని వినికిడి.డబ్బుల కోసం చూసుకుంటే ఇక్కడ నీ కెరియర్ ఫినిష్ అయిపోతుందని హెచ్చరించాడట నాగ్.
కాగా నయనతార ఈ విషయంలో చాలా ఫైర్ అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.ఏదిఏమైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు నయనతార తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ స్థాయికి చేరుకుందంటే మాటలు కాదు! ఒడ్డు, పొడుగు, అభినయం, అందం ఉండడంతో నిర్మాతలు కోలీవుడ్లో దాదాపుగా ఆమెకే అగ్రతాంబూలం ఇస్తారు.