బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.వీటిలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడతామని మ్యానిఫెస్టోలోనే పెట్టామన్న మంత్రి శ్రీధర్ బాబు త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని చెప్పారు.ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోరుకున్నారో వాటిని అమలు చేస్తామన్నారు.

గడిచిన పదేళ్లు లక్ష్యాలు చేరుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని పేర్కొన్నారు.

అయితే ప్రజలు కోరుకున్న మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చూపిస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు