ఈ రసంతో మీ ఇమ్యూనిటీని పెంచుకోండి!

కరోనా భయం ఇంకా తొలగలేదు.అంతలోనే థర్డ్‌ వేవ్‌ భయం.

అది రాక ముందే డెల్టా వేరియంట్‌ వణికిస్తోంది.

మరోవైపు వర్షాలు ముంచుకొస్తున్నాయి.

ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడుతున్నాయి.వీటితో సీజనల్‌ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో మీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే, మనం ఇంట్లో సులభంగా.

Advertisement

అతి తక్కువ ధరలో మన అమ్మమ్మల కాలం నాటి ఇమ్యూనిటీ బూస్టర్‌ను తీసుకోవాలి.అదేనండి వెల్లుల్లి రసం.అవును ఈ రసంతో మీ ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది.ఇది పూర్వ కాలం నుంచే రుజువైంది కూడా.

ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు వాడటం వల్ల తక్షణ శక్తి వస్తుంది.వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, ఇతర సువాసనలను ఇచ్చే పదార్థాలను ఈ వంటకంలో వాడతాం.

దీంతో కరోనాతో పోరాడటానికి ఇటువంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాల్సిందే కదా! దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.దీన్ని ప్రముఖ డైటీషియన్‌ స్పేషలిస్ట్‌ ప్రియాంక సింగ్‌ సూచించారు.

ఈ రెసిపీ కూడా మన భారతీయ వంటిళ్లలో ఎప్పుడు అందుబాటులో ఉండేవే.దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

చింతపండు గుజ్జు, టమాట, కరివేపాకు, వెల్లుల్లి, మిరియాలు అవసరం.ఇందులో ఎటువంటి పప్పులను వాడకూడదు.

Advertisement

కావాల్సిన పదార్థాలు.

చింతపండు – ఒక టేబుల్‌ స్పూన్, టమాట– 1, కట్‌ చేసింది, వెల్లులి–5 రెబ్బలు, ఎండుమిర్చి–2, ఉప్పు– రుచికి తగినంత, జిలకర్ర –1 స్పూన్, ఇంగువ– 1/2 స్పూన్, కొత్తిమీర– ఒక కట్ట, నూనె–1 స్పూన్, అవాలు–1 స్పూన్‌.

తయారీ విధానం.

ఎండు మిర్చి, మిరియాలు, జిలకర్ర, వెల్లుల్లిని డ్రై రోస్ట్‌ చేసుకోవాలి.ఆ తర్వాత వాటిని గ్రైండ్‌ చేసుకోవాలి.దీన్ని పక్కన పెట్టి.

ఓ బాండీ తీసుకుని అందులో ఆయిల్‌ పోయాలి.అది వేడయ్యాక కట్‌ చేసిన టమాటాలు, పసుపు, ఉప్పు వేసి 3–4 నిమిషాల పాటు వేయించాలి.

దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాల పొడిని వేసుకోవాలి.దీన్ని కలిపి, చింతపండు గుజ్జును వేసుకోవాలి.

దాంతోపాటు 2 కప్పుల నీటిని పోయాలి.ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాలపాటు సిమ్‌లో మగ్గనివ్వాలి.

మరో ప్యాన్‌లో పోపు కోసం ఆయిల్‌ వేసి, అవాలు, జిలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి చిటపటలాడినాక దీన్ని రసం రెసిపీలో కలపాలి.పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఎంతో గుమగుమలాడే రసం రెడీ అయిపోయినట్లే.దీన్ని వైట్‌రైస్‌తో తింటే అద్భుతం అనాల్సిందే! ఇందులో వాడిన చింతపండు, పసుపు, కరివేపాకు, యాంటీ ఫంగల్‌ క్వాలిటీ కలిగిన టువంటివి.

వెల్లుల్లి అంటేనే ఇమ్యూనిటీ బూస్టర్‌ అని ప్రపంచవ్యాప్తంగా తెలుసు! ఇది సాధరణ జలుబు,దగ్గుకు కూడా చెక్‌ పెడుతుంది.

తాజా వార్తలు