ఈ మధ్య కాలంలో కొందరు పనిచేయగా వచ్చేటువంటి డబ్బులు సరిపోకపోవడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే కోరికతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.కాగా తాజాగా ఓ నటి తన భర్తతో కలిసి మనీలాండరింగ్ కి పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఘటన వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలోని చిత్రాలు మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి నటించి బాలీవుడ్ ప్రముఖ నటి లీనా మరియా పాల్ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ మధ్య కాలంలో నటి లీనా మరియా పాల్ డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కి దేశంలోని బడా బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది.
దీంతో ఇటీవలే లీనా మరియా పాల్ భర్త సుఖేష్ చంద్రన్ ని పోలీసులు అరెస్టు చేసి అతని ఇంటిపై దాడి చేసి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు.ఈ క్రమంలో నటి లీనా మరియా పాల్ కి సంబంధించిన కార్యకలాపాలలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కి కూడా హస్తం ఉందని తెలియడంతో ఆ హీరోయిన్ ని ప్రభుత్వ అధికారులు దాదాపుగా 5 గంటల సేపు పాటూ విచారించారు.
విచారణ అనంతరం అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని నిర్ధారించారు.దీంతో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సేఫ్ అయినప్పటికీ లీనా మరియా పాల్ మాత్రం కటకటాల్లోకి నెట్టబడింది.
దీంతో పోలీసులు ఈ విషయాన్ని చాలా లోతుగా విచారిస్తున్నారు.అంతేకాకుండా లీనా పాల్ మరియు సుఖేష్ చంద్రన్ ల వల్ల నష్టపోయిన మరియు మోసపోయిన వ్యక్తుల జాబితాను సేకరిస్తూ వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి లీనా మరియా పాల్ బాలీవుడ్లో ఆ మధ్య ప్రముఖ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన “మద్రాస్ కేఫ్” చిత్రం ద్వారా బాగా పాపులర్ అయ్యింది.దీంతో ఈ అమ్మడికి కొంతమేర సినీ అవకాశాలు బాగానే తలుపు తట్టినప్పటికీ అక్రమ దారుల్లో డబ్బు సంపాదించాలన్న ఆశ కారణంగా తన సినీ కెరీర్ ని చేజేతులారా నాశనం చేసుకుంది నటి లీనా మరియా పాల్.