అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. ఎవరంటే?

తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చిత్రంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం "భీమ్లా నాయక్".

మలయాళంలో ఎంతో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్చి త్రానికి రీమేక్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.ఇందులో రానా కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పలు భాషలలో రీమేక్ చేయాలని చాలామంది చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీ రీమేక్ చిత్రంగా తెరకెక్కించాలని సన్నాహాలు చేశారు.ఈ క్రమంలోనే హిందీ రీమేక్ చిత్రానికి జగన్ శక్తి దర్శకత్వం వహించగా ఇందులో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

ఈ విషయమే చిత్రబృందం గత కొద్ది రోజుల క్రితం అధికారిక ప్రకటన కూడా చేసింది.

తాజాగా ఈ ఇద్దరు సెలబ్రిటీస్ తో చర్చలు జరిపిన అనంతరం ఈ కథలో కొన్ని మార్పులు చేసి నవంబర్ నెలలో ఈ సినిమాను పట్టాలపైకి తీసుకువెళ్లడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇక అంతా సవ్యంగా ఉందనుకున్న క్రమంలో ఈ సినిమా నుంచి అభిషేక్ బచ్చన్ తప్పుకున్నట్లు సమాచారం వినబడుతోంది.ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ ఉన్నఫలంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే ఈ విషయంపై చిత్రబృందం లేదా అభిషేక్ బచ్చన్ స్పందించాల్సి ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు