ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..?

బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మనీష్ శర్మ  2010వ సంవత్సరంలో దర్శకత్వం వహించినటువంటి "బ్యాండ్ బాజా బరాత్" అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన హీరో రణవీర్ సింగ్ గురించి సినీ ప్రేక్షకులకి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు.

అయితే రణవీర్ సింగ్ ఎలాంటి సినీ కుటుంబ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకి వచ్చి కష్ట పడి అవకాశాలు దక్కించుకుని వాటిని సద్వినియోగం చేసుకుంటూ మంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అందుకే నూతన నటీనటులకు రణవీర్ సింగ్ ఆదర్శంగా గెలుస్తున్నాడు.అయితే తాజాగా రణవీర్ సింగ్ అధికారిక సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన చిన్నప్పుడు దిగిన ఫోటో ని షేర్ చేశాడు.

అయితే ఈ ఫోటోని షేర్ చేసిన 9 గంటల లోపే దాదాపు పది లక్షల పైచిలుకు లైకులు వచ్చాయి.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో రణవీర్ సింగ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అని.అయితే కొంతమంది రణవీర్ సింగ్ అభిమానులు మాత్రం ఈ ఫోటో పై స్పందిస్తూ రణవీర్ సింగ్ నిజమైన హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రణవీర్ సింగ్ బాలీవుడ్ లో సూర్య వంశి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగాఉంది. అలాగే ఇటీవలే జైష్ జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

 .

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు