విడాకులు తీసుకోవడం మంచి నిర్ణయమే.. నటి సంచలన వ్యాఖ్యలు?

విడాకులు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటివి ఎక్కువగా వినిపించేవి సినీ ఇండస్ట్రీలోనే.కొందరు నటులు పెళ్లిళ్లు చేసుకొని తమ కెరీర్ ను కూడా సాఫీగా సాగదీస్తారు.

మరికొందరు తమ కెరీర్ కు తమ పెళ్లి జీవితం అడ్డుగా ఉందని విడాకులు తీసుకుంటారు.ఇలా తమకు అర్థం చేసుకున్న వాళ్ళు వస్తే జీవితం అద్భుతంగా సాగుతుంది.

లేదంటే విడాకులను తమ ముందు వేసుకుంటారు.మళ్లీ తమ జీవితానికి సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటారు.

ఇదిలా ఉంటే ఓ నటి విడాకులు తీసుకోవడం మంచి నిర్ణయం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఇంతకీ ఆ నటి ఎవరంటే.

Advertisement

బాలీవుడ్ నటి సుపర్ణ మోయిత్ర. వెండితెర సినిమాలలో, బుల్లితెరలో సీరియల్ లలో కూడా నటించింది.ఇక తన నటనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.2015లో మీరఠియా గ్యాంగ్ స్టర్స్ సినిమాతో వెండితెరకు పరిచయం కాగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.ఇక 2017 లో ఏ ప్యార్ నహి తో క్యా హై సీరియల్ తో బుల్లి తెరకు పరిచయమైంది.

ఇక ఆమె తన చదువులు పూర్తి చేసిన తర్వాత పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని ముంబైలోనే ఉండిపోయింది.ఇక తన కూతురు రియా పుట్టిన కొన్ని ఏళ్లకే భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇక అప్పటి నుంచి తన బిడ్డను తానే చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆమె మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ అగర్వాల్ ను పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతుంది.అంతేకాకుండా తనకు ఇష్టమైన రంగం సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ సంతోషంగా జీవిస్తుంది.

ఇక సంతోషంగా ఉన్నప్పుడు జీవితం చాలా చిన్నది గాని, బాధగా ఉన్నప్పుడు పెద్దదిగాను కనిపిస్తుందని, ఏదైనా మనం ఆలోచించే విధానంలో ఉంటుందని తెలిపింది.ఇక తాను విడాకులు తీసుకొని మంచి పని చేసిందట.లేదంటే ఇంట్లోనే మిగిలిపోయేదానని చెప్పుకొచ్చింది సుపర్ణ.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు