నేటి తరం వివాహ బంధంలో ఓర్పు, సహనం లేదు.... దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్!

రామ్ లీలా( Ram Leela ) సినిమాలో జంటగా నటించిన రణవీర్ సింగ్(Ranveer Singh),దీపికా పదుకొనే అనంతరం పలు సినిమాలలో నటించారు.

ఇలా సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ 2018 లో వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఈ విధంగా దీపిక ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దీపికా పదుకొనే వైవాహిక జీవితం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bollywood Actress Deepika Padukone About Secret Of Happy Married Life,prabhas,pr

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దీపికా పదుకొనే( Deepika Padukone ) వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.నేటితరం యువతీ యువకులకు వివాహ బంధంలో ఏమాత్రం ఓర్పు సహనం అనేది లేవని తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈమె వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

ఎవరికైతే వైవాహిక జీవితంలో ఓర్పు సహనం ఉండదు అలాంటి వారందరూ కూడా పాతతరం వారిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని ఈమె సూచించారు.మనమంతా సినిమాలు చూసి లేదా మన చుట్టూ ఉన్న సంబంధాలు, వివాహాల ద్వారా ఎంతో ప్రభావితం అవుతామని తెలియజేశారు.

Bollywood Actress Deepika Padukone About Secret Of Happy Married Life,prabhas,pr
Advertisement
Bollywood Actress Deepika Padukone About Secret Of Happy Married Life,Prabhas,Pr

ఒక వైవాహిక జీవితం( Marriage Life )లో మాత్రమే ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం చాలా విభిన్నంగా ఉంటుంది.అయితే వైవాహిక జీవితం బలంగా ఉండాలి అంటే ఇద్దరికీ ఎంతో ఓర్పు సహనం అనేది ఉండాలని ప్రస్తుత కాలంలో ఈ సహనం అనేది పూర్తిగా కోల్పోయారని ఈమె తెలిపారు.ఇది మనం మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సిన విషయమని,వైవాహిక జీవితంలో సంతోషంగా గడపాలి అంటే మనం మన పెద్దవారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా దీపికా పదుకొనే వెల్లడించారు.

వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలంటే అన్నింటికన్నా సహనం ముఖ్యమని అది ఉన్నప్పుడే మన చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుందని దీపికా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రభాస్( Prabhas ) నటిస్తున్న ప్రాజెక్టు కే ( Project K )సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు