ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత వరుసగా అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి.
చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.చిత్రపరిశ్రమలో ఒత్తిళ్లని తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఇప్పుడు మరో బాలీవుడ్ నటి అనుమానాస్పద స్థితిలో మృతి మృతి చెందింది.
ప్రముఖ నటి, మోడల్ అర్య బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.డర్టీ పిక్చిర్ సినిమాలో విద్యాబాలన్‌తో కలిసి కీలక పాత్రలో నటించిన ఈమె కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు.
అయితే అకస్మాత్తుగా ఆమె తన నివాసంలో శవమై కనిపించడం కలకలం రేపింది.ఇంటి పని మనిషి వచ్చి ఎంత సేపు తలుపు కొట్టినా, ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఆమె పక్కనే ఉన్నవారికి తెలియజేసింది.
వారు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి అపార్ట్‌మెంట్ తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు.బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.గతకొంతకాలం నుంచి కోల్‌కత్తాలోని తన నివాసంలో బెనర్జీ ఒంటరిగా నివసిస్తున్నారు.అంతేకాకుండా ఆమె వాంతులు చేసుకున్నాట్లు గుర్తులు కనిపిస్తున్నాయని, ఆమె తన నివాసంలో పడిపోయిఉందని, నేలపై కొన్ని రక్తపు చుక్కలు ఉన్నాయని చెప్పారు.
బెనర్జీని ఎవరైన హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.ఈమె ఎల్‌సీడీ, లవ్ సెక్స్ ఔర్ ధోకా, డర్టీ పిక్చర్ సినిమాలలో నటించారు.
సినిమా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం మోడలింగ్ లో రాణిస్తుంది.అయితే ఆమె మరణ వార్త ఇప్పుడు బాలీవుడ్ లో దిగ్బ్రాంతికరంగా మారింది.