ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యాపిల్‌కు కంపెనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.ఈ కంపెనీకి చెందినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అయితే ఫుల్ డిమాండ్ ఉందనే చెప్పాలి.
వరుసగా ఆ కంపెనీ నుంచి విడుదలవుతున్న ఫోన్లకు అయితే ఇట్టే డిమాండ్ ఉండటంతో వెను వెంటనే అమ్ముడుపోతుంటాయి.దీన్ని దృష్టిలో ఉంచుకని ఆ సంస్థ నుంచి కూడా కొత్త టెక్నాలజీతో కూడినటువంటి యాపిల్ ఐఫోన్లు వస్తుంటాయి.
మన ఇండియాలో కూడా ఈ యాపిల్ కంపెనీ ఉత్పత్తులు చేసే వస్తువులపై కూడా మంచి గిరాకీ ఉంది.
యాపిల్ సంస్థకు నిజంగా చెప్పాలంటే భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉందని చెప్పాలేమో.
ఎందుకంటే ఈ వస్తువులు మన దగ్గర అంతలా అమ్ముడుపోతుంటాయి.ఇందుకు నిదర్శనంగా రీసెంట్ గా యాపిల్ కంపెనీ 13సిరీస్ ఫోన్ లను విడుదల చేయగా ఆ కార్యక్రమాన్ని కూడా మన ఇండియా నుంచే ఎక్కువమంది వీక్షించడం ఇక్కడ విశేషం.
అయితే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అయినటువంటి అనుపమ్ ఖేర్ ఇప్పుడు ఈ కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు.ఇప్పుడు ఆయన అమెరికా పర్యటనలో ఉండగా అక్కడి నుంచే ఇలాంటి కామెంట్లు చేశారు.

రీసెంట్ గా ఆయన న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్ కు వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను ఆయన పరిశీలించారంట.అయితే ఈ స్టోర్‌లో ఒలింపిక్స్ కలెక్షన్ పేరిట ఆ కంపెనీ స్మార్ట్ వాచీలను సందర్శకుల కోసం డిస్ ప్లే లో ఉంచి వాటి గురించి వివరిస్తున్నారంట.కాగా ఈ స్మార్ట్ వాచీలపై అన్ని దేశాలకు చెందినటువంటి జెండాలు కనిపించినా కూడా మన ఇండియా జెండా మాత్రం ఎక్కడా కనిపించకలేదంట.దీంతో ఆయన దాన్ని వీడియో తీసి ఇందులో భారత్ జెండా కనిపించకపోవడం దారుణం అన్నారు.
భారత్‌లోనే వీరి వస్తువులు ఎక్కువ అమ్ముడుపోతున్నా వారు ఇలా చేయడం మంచిది కాదన్నారు.