పెద్ద సంఖ్యలో వాట్సప్ ఖాతాలు బ్లాక్..?!

ప్రస్తుతం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు.ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ ని వినియోగించే వారి సంఖ్య దాదాపు 200 కోట్లకు పెరిగింది.

మేసేజింగ్, ఫైల్స్ వీడియోస్, పేమెంట్ ఆప్షన్ లాంటి ఫీచర్లతో వినియోగదారులకు అత్యంత అందుబాటులో ఉంటూ దూసుకుపోతుంది.ప్రతి నలుగురిలో ఒకరు వాట్సాప్ వాడుతున్నారంటే దీన్ని ప్రాముఖ్యత అర్థం అవుతుంది.

టచ్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ తప్పని సరి అయిపోయింది.వినియోగదారులు పెరిగే కొద్దీ సేఫ్టీ కూడా తగ్గిపోతుంది.

కొందరు పదే పదే తప్పుడు సందేశాలు పంపుతూ వాట్సాప్ ను అనవసర విషయాలకు వాడుతున్నారు.దీంతో యాప్ వాడే యూజర్లు ఇండియా గ్రీవియన్స్ ఆఫిసర్ కు ఫిర్యాదులు చేశారు.

Advertisement

వారి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా జూన్, జులై 2021 లో దాదాపు 3 మిలియన్లకు పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది.సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందించడం కోసం ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపింది.

దీంతో వాట్సాప్ యూజర్ సేఫ్టీ కోసం కొత్త ఐటీ చట్టం 2021 కి అనుగుణంగా యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ బయటకు విడుదల చేసింది.తమ సొంత టూల్స్ గుర్తించిన 3027 స్పామ్ ఖాతాలు ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 వరకు 46 రోజుల వ్యవధిలో యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖాతాలను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.

తప్పుడు సందేశాలు వ్యాప్తి నివారణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నట్లు తెలిపింది. [email protected] mail ద్వారా తమకు మెయిల్ చేసి సంప్రదించవచ్చునని తెలిపింది.

యూజర్ సేఫ్టీ కోసం తాము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటామని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది.ఇక నుంచి వాట్సాప్ యూజర్లకు అత్యంత సెక్యురిటి కలిగిన సేవలను అందిస్తామని స్ఫష్టం చేసింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు