తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల పోరులో అధికారం కోసం ఆ మద్య బీజేపీ ( BJP )తెగ ఆరాటపడింది.అయితే ఎన్నికలకు ఆర్నెళ్ళ ముందు నానా హడావిడి చేసిన బీజేపీ సరిగ్గా ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి డీలాపడింది.
ఊహించని విధంగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు పార్టీ దూకుడును గట్టిగానే దెబ్బ తీశాయి.ఫలితంగా ఎన్నికల ముందు పార్టీలో ఉత్సాహం కొరవడింది.
అటువైపు అధికార బిఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్( BRS , Congress ) పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఎలక్షన్ హీట్ ను తారస్థాయికి తీసుకెళుతుంటే.బీజేపీ మాత్రం ఉన్న లేనట్లుగానే వ్యవహరిస్తోంది.

జాతీయ నేతలు తరచూ రాష్ట్ర పర్యటనలు చేస్తున్నప్పటికి పార్టీలో పరిస్థితి మాత్రం దారికి రావడంలేదు.ఇప్పటికే రెండు సార్లు రాష్ట్రనికి వచ్చిన మోడీ( Modi ) ఈనెల 25 నుంచి 27 వరకు మరో మూడు రోజులు తెలంగాణలోనే మకాం వేయనున్నారు.ఇక తాజాగా రాష్ట్రానికి అమిత్ షా( Amit Shah ) కూడా వచ్చారు.వచ్చిరావడంతోనే బీజేపీ మేనిఫెస్టో ( BJP Manifesto )ప్రకటించి పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం కాషాయ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజ్, ఎరువులపై సబ్సిడీ, రైతులకు ఉచిత పంటభీమా.ఇలా ఎన్నో అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించింది కాషాయ పార్టీ.

ఇక ఈ మేనిఫెస్టోను ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు కమలనాథులు.ప్రస్తుతం మేనిఫెస్టో అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండడంతో పార్టీ నేతల్లో కూడా జోష్ పెరుగుతుందనే అభిప్రాయంలో కమలం పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అనుకున్న స్థాయిలో ఇప్పటివరకు పార్టీకి మైలేజ్ రాలేదు.దాంతో ఇకనుంచైనా ఉన్న ఈ కొద్ది సమయంలో ప్రచారంపై గట్టిగా దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం.
మరి కమలనాథుల చివరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.