టిడిపి జనసేన పార్టీలు 2024 ఎన్నికల్లో కచ్చితంగా పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తాయనే విషయం అందరికీ క్లారిటీ వచ్చేసింది .దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా పవన్ వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
ఇక ఆ తర్వాత ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేన తో ముందుకు వెళ్తాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడంతో కచ్చితంగా జనసేన టిడిపిలు ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకుంటాయి అనే విషయం అందరికీ క్లారిటీ వచ్చేసింది.జనసేన పార్టీ తో పొత్తు అంశంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
జనసేన బిజెపి పొత్తు కొనసాగుతుంది అంటూ వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.ఇటీవల పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టిడిపి , జనసేన జెండాలు కలిసి కనిపించడం పైన కూడా వీర్రాజు స్పందించారు.
ఆ జెండాలను చంద్రబాబు ఏర్పాటు చేశారని, రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఏపీలో జనసేన తో తప్ప మరో పార్టీతో బిజెపికి పొత్తు లేదని వీర్రాజు క్లారిటీ ఇచ్చేసారు.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బిజెపితో కలిసి వెళ్లే కంటే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళితే తప్పకుండా ఏపీ లో సక్సెస్ అవ్వ వచ్చు అనే లెక్కల్లో ఉన్నారు.
టిడిపి జనసేన ల బంధం మరింతగా బలపడి, రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందేమో అన్న భయం బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లో ఉన్నట్టుగా అర్థమవుతుంది.అందుకే వీలైనంత దూరంగా జనసేనకు టిడిపిని దూరంగా ఉంచాలని ఆయన భావిస్తున్నారు.
ప్రస్తుతం జనసేన, టిడిపి వైపు అడుగులు వేయకుండా బీజేపీని ఆకట్టుకునే విధంగా వీర్రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.కానీ పవన్ మాత్రం బీజేపీ విషయంలో అంత ఆసక్తిగా ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు బిజెపితో కలిసి వెళ్లిన పెద్దగా ఉపయోగం ఉండదని ఆ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు లేదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు అయితే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో కొన్ని కొన్ని విషయాల్లో బిజెపి సహకారం అవుతుంది తప్ప ఏపీలో ఆ పార్టీ వల్ల తమకు కలిసి వచ్చేది ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు అందుకే బిజెపితో పొత్తు నేరుగా రద్దు చేసుకునే కంటే ఆ పార్టీతో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తే మంచిదని రాష్ట్రంలో బిజెపిని తాము పట్టించుకోకపోయినా కేంద్ర బిజెపి పెద్దలకు మాత్రం మద్దతుదారులుగాని నిలబడడం వల్ల కలిసి వస్తుందని ఏపీలో వైసిపి సైతం ఇదేవిధంగా ముందుకు వెళ్తుండడంతో తాము అవార్డులోని నడిస్తే మంచిదని ఆలోచనతో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

టిడిపికి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఉండడం తమకు కలిసి వస్తుందని పవన్ భావిస్తున్నాడని బిజెపి గ్రహించింది అందుకే తమకు జనసేన దూరం కాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఆ పార్టీ అగ్ర నాయకుల సైతం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఇప్పటికే ఈ విషయంపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ స్పందించారు 2024 ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.వీర్రాజు సైతం జనసేన మద్దతు దూరం కాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.