ఎన్టీఆర్ సినిమా చేయాలని ఉందంటున్న జాన్వీ.. మరి అవకాశం ఇచ్చేనా!

మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా నటీ నటులు కూడా మారుతున్నారు.ఇది వరకు లాగా కాకుండా హీరోయిన్స్ తమ మనసులోని మాటలను డైరెక్ట్ గానే చెప్పేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.

 Janhvi Kapoor To Make Her South Debut With Jr Ntr Film Details, Janhvi Kapoor,jr-TeluguStop.com

తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తన మనసులోని మాటలను బయట పట్టింది.ఈమెకు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని మరోసారి బహిరంగంగానే చెప్పింది.

ఇప్పటికే పలు సార్లు ఈమె సౌత్ భాషల్లో నటించడం అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పుకొచ్చింది.ఇక తాజాగా గుడ్ లక్ జెర్రీ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

యంగ్ హీరోల్లో అందరు ఇష్టమే కానీ ముఖ్యంగా తనకు అవకాశం వస్తే మాత్రం ఎన్టీఆర్ గారితో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని చెప్పింది జాన్వీ.ఇటీవలే ట్రిపుల్ ఆర్ చూశానని.

చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చింది.

మరి ఈమె కోరిక బయట పెట్టడంతో ఎన్టీఆర్ 30 లో ఈమెకు కొరటాల అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

ఇస్తే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల పెయిర్ సూపర్ గా ఉంటుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయం చెబుతున్నారు.

Telugu Luck Jerry, Janhvi Kapoor, Janhvikapoor, Jr Ntr, Koratala Siva, Ntr-Movie

ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో నెక్స్ట్ సినిమా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది లేదు.కానీ బ్యాకప్ లో మాత్రం స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 9 కేజీల బరువు తగ్గి స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు.ఈ సినిమాను యువసుధ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు.మరి ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube