అవును, ఇపుడు ఇదే విషయం సోషల్ మీడియాలోనే కాకుండా దేశీయంగా పెను దుమారాన్ని సృష్టిస్తోంది.బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ అయినటువంటి ‘గౌరీ శంకర్ బిసెన్'( BJP MLA Gauri Shankar Bisen ) ఓ కార్యక్రమంలో మైనర్ బాలికలను అనుచితంగా తాకినట్లు వెల్లువెత్తుతున్నాయి.
కాగా దానికి సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేయగా అది కాస్త ఇపుడు వైరల్ అవుతోంది.ఈ వీడియోని సరిగ్గా గమనిస్తే గౌరీ శంకర్ మైనర్ బాలికలతో కలిసి ఫోటో కోసం వారి ఛాతీ, చేతులను తాకడం చాలా స్పష్టంగా చూడవచ్చు.
బాలాఘాట్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది… అంటూ ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో కోట్ చేస్తూ ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్( Madhya Pradesh Congress Tweet ) చేస్తూ….“బిజెపి మాజీ మంత్రి, వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గౌరీ శంకర్ బిసెన్ అమ్మాయిలతో సిగ్గుమాలిన పని చేసారు” అని పోస్ట్ చేసారు.అంతటితో ఆగకుండా “ఈ అమ్మాయిలకు మహిళా డాక్టర్ కౌన్సెలింగ్ ఇవ్వాలి.ఆ అమ్మాయిల ఆవేదనను బహిరంగపరచాలి.” అంటూ వైరల్ చేస్తున్నారు.ఇకపోతే మాజీ మంత్రి అనుచితంగా ప్రవర్తించారనే కాంగ్రెస్ ఆరోపణను తీవ్రంగా ఖండించింది బిజెపి.ప్రతి విషయాన్ని బూతద్దంలో చూడొద్దని… మైనర్ బాలికల జీవితాలతో అడ్డుకోవద్దని మనవి చేసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ తీరుపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆ అమ్మాయిలు తన మనవరాలి వయస్సులో వున్నవారని, బిసెన్ వారిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు తప్పితే అందులో దురుద్దేశం లేదని, ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర సింగ్ సలుజా( Narendra Saluja ) అన్నారు.మధ్యప్రదేశ్ హోం మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి నరోత్తమ్ మిశ్రా ఈ విషయంమీద స్పందిస్తూ… కాంగ్రెస్ నీచమైన, దారుణమైన, అమానుషమైన ఆలోచనలపై మండిపడ్డారు.అయన విలేఖరులతో మాట్లాడుతూ… “ఇది కాంగ్రెస్ నీచమైన మనస్తత్వాన్ని బయటపెట్టింది.
అమ్మాయిల పట్ల బిసెన్ ప్రేమను ప్రతిబింబించే వీడియోను వారు ఇలా రాజకీయం చేయడం వారి మురికి రాజకీయాలను ప్రతిబింబిస్తుంది.మేము ఈ సమస్యను న్యాయపరంగా తీసుకు వెళ్తాము.
ముఖ్యంగా అమ్మాయిలను ఇలా చిత్రీకరించడం అత్యంత దారుణం.వారి మర్యాదకు భంగం కలుగదా?” అని మిశ్రా అన్నారు.







