తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఆయన ఖండించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేకే భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు.ఈ విధంగా దాడులు చేసి ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారన్నారు.
కానీ గడీల గూండాల దాడులకు, తోక ఊపులకు భయపడేది లేదని చెప్పారు.బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని తెలిపారు.
టీఆర్ఎస్ గూండాలకు ప్రజలే కర్రుకాల్చి వాత పెడతారని వెల్లడించారు.