తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది.ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు.
సగానికి పైగా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు.ఈ నేపథ్యం లో విజేత ఎవరు అంటూ ఆసక్తికర చర్చ జరుగుతుంది.
మొదటి నుండి కూడా రేవంత్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో శ్రీహాన్ కూడా తక్కువేం కాదు అంటూ కొందరు ఈ ఆ మధ్య కాలం లో వ్యాఖ్యలు చేశారు.కానీ శ్రీహాన్ గత కొన్ని వారాలుగా తన ఆటను కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాడు.
ఇంతకు ముందు మాదిరిగా కాకుండా ఒక జోన్ కి వెళ్ళి పోయి వాళ్లతోనే ఉంటూ పెద్దగా ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించలేక పోతున్నాడు.అంతే కాకుండా పదే పదే చిల్లరగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు కూడా విసుగు తెప్పిస్తున్నాడు.
శ్రీ సత్య స్నేహం అతడికి చేటు చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు.అందుకే రేవంత్ కి పోటీగా ఇప్పుడు శ్రీహన్ లేనే లేడని.కచ్చితంగా రేవంత్ మాత్రమే విజేతగా నిలుస్తాడు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.గతం లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని సీజన్ విజేత దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాడని అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతం లో ఇండియన్ ఐడల్ విజేత గా నిలిచిన రేవంత్ ఇప్పుడు అదే జోరు తో బిగ్ బాస్ కూడా గెలవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ధీమా తో ఉన్నారు.మరో ఐదు లేదా ఆరు వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది.
ఆ గ్రాండ్ ఫినాలే లో రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 యొక్క ట్రోఫీని అందుకోవడం ఖాయం అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.