పాత సీసాలో కొత్త సార మాదిరిగా బీజేపీ ప్రచారం... గందరగోళంలో ప్రజలు

తెలంగాణలో అసలు బీజేపీకి స్థానం ఉంటుందా అన్న స్థాయి నుండి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందా అన్న చందంగా బీజేపీ ఎదిగింది.

ఏ మాత్రం హడావిడి లేకుండా చాప క్రింద నీరులాగా విస్తరించి క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేపడుతూ రాష్ట్ర స్థాయి నాయకత్వం గట్టిగా భరోసా ఇవ్వడంతో బీజేపీ కార్యకర్తలలలో కొంత మేర ఉత్సాహం కలిగి రాష్ట్రంలో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందని ఒక సంకేతాన్ని ప్రజలకు బలంగా ఇవ్వడంలో విజయవంతం అయ్యారనే చెప్పవచ్చు.

దాని ఫలితమే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం.అయితే ఎవరికైనా విజయం సాధించినప్పుడు దానిని బాధ్యతగా భావించి ఆ పేరును కాపాడుకుంటూ మరింత ఎదిగేందుకు ప్రయత్నించాలి.

కానీ ఏదైతే మాటల తూటాల అస్త్రాన్ని ప్రయోగించామో అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అనుకున్న బీజేపీ వ్యూహం బెడిసి గొట్టిందని చెప్పవచ్చు.ప్రజలు అమాయకులు అనుకోవడం పెద్ద పొరపాటు.

ప్రజలు తాము ఏది చెప్పినా నమ్ముతారనుకోవడం చాలా తప్పు.అందుకే టీఆర్ఎస్ పై సంబంధం లేని విమర్శలు చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం లాంటి ప్రజల్లో పలుచబడ్డారు.

Advertisement

తాజాగా నాగార్జున సాగర్ ప్రచారంలో సైతం పాత సీసాలో కొత్త సారా అన్న మాదిరిగా కేంద్రం ఇన్ని నిధులిచ్చింది, నాగార్జున సాగర్ అభివృద్ధికి బీజేపీ కారణమని ప్రచారం చేయడం బీజేపీని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి బలమైన క్యాడర్ లేదు,బలం లేదనే విషయాన్ని బీజేపీ మర్చిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు