ప్రధాని మోడీపై బిల్ గేట్స్ ప్రశంసలు...

కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికాతో పాటు చాలా దేశాలు చిగురుటాకుల వణికిపోతూ ఉంటే 120 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ప్రధాని మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.

అమెరికాలో లక్షల సంఖ్యలో కరోనా బారిన పడి, రోజుకి వందల సంఖ్యలో చనిపోతున్నారు.

ఇక భారత్ లో ఇప్పటికి కరోనా రోగుల సంఖ్య 20 వేలకి పరిమితం అయ్యింది.అందులో మూడు వేల మంది వరకు తిరిగి కరోనా నుంచి రికవరీ అయ్యారు.

ఇంత పకడ్బందీగా కరోనాని ఇండియాలో కట్టడి చేసే ప్రయత్నం చేసిన మోడీ ఆలోచనని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి.ప్రధాని ముందుచూపు, ఆర్ధిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయం ఇప్పుడు దేశాన్ని ఒక సురక్షిత స్థానంలో ఉంచింది.

ఈ నేపధ్యంలో భారత్ లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ లేఖ రాశారు.

Advertisement

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన లాక్ డౌన్, హాట్ స్పాట్ కేంద్రాల గుర్తింపు, వైరస్ బారినపడ్డ వారిని ఐసోలేషన్ కేంద్రాలకు, అనుమానితులను క్వారంటైన్ లో ఉంచడం వంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు.ఈ సందర్భంగా కరోనా బాధితులకు వైద్యుల సేవలను, ఆరోగ్య సేతు వంటి యాప్ లను అందుబాటులోకి తేవడాన్ని ఆయన కొనియాడారు.

ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలు ఇండియాని సేఫ్ జోన్ లో ఉంచాయని ప్రశంసలు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు