ఇటీవలే అన్ని అక్రమ సంబంధాలు చివరికి కుటుంబాలలో తీరని విషాదాలనే మిగిలిస్తున్నాయి.కొద్ది క్షణాల శారీరక సుఖాన్ని పొందడం కోసం జీవితాన్ని చివరకు జైలు పాలు చేసుకుంటున్నారు.
ప్రతి రోజు ఎన్నో రకాల దారుణాలను చూస్తూనే ఉన్నాం.అయినా కూడా చాలామంది అక్రమ దారిలో నడుస్తూ కుటుంబ సభ్యులపై దారుణంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు.
వివాహ బంధాల కంటే వివాహేతర బంధాలకే అధిక ప్రాధాన్యం పెరుగుతోంది.ఇలాంటి కోవలోనే ప్రియుడి మోజులో ఉండే ఓ మహిళ తన భర్తను అడ్డు తొలగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.
ప్లాన్ లో భాగంగా సెల్ఫీ తీసుకుందాం అని భర్తను చెట్టుకు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది.ప్రస్తుతం ఈ ఘటన బీహార్ లోని ( Bihar )వాసుదేవ్పూర్ సరాయ్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకెళితే.బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా( Muzaffarpur ) లోని సాహిబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే వాసుదేవ్ పూర్ సరాయ్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ మహిళ తన భర్తను సెల్ఫీ దిగేందుకు చెట్టు దగ్గరికి తీసుకువెళ్లింది.సెల్ఫీలు దిగుతూ సమయం చూసుకొని భర్తను చెట్టుకు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కింది.వెంటనే శరీరంపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టేసింది.

చెట్టు వద్ద భారీగా మంట చెలరేగడంతో గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని విచారించగా తన భార్య చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టిందని తెలిపాడు.ఆ తర్వాత పోలీసు( Police )లు ఇంటి పక్కన ఉండే వ్యక్తులను విచారించగా ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అందుకే భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఇలా దాడి చేసిందని తెలిపారు.
పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.







