బిగ్ బాస్ లో శివాజీ( Shivaji ) చాలా రోజులుగా తన పెత్తనాన్ని చూపిస్తూ ఒక గ్యాంగ్ కి హెడ్ గా దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే బిగ్ బాస్( Bigg Boss ) అంటే కేవలం ఆటలు ఆడటం, లేదంటే కప్పు కొట్టడం కాదు.
మనసుల హృదయాలను గెలుచుకోవడం అనే విషయం ఎప్పటికీ అర్థం అవుతుందో ఏమో ఈ హౌస్ మేట్స్ కి.నిజానికి సీజన్ లో శివాజీ ఇప్పటి వరకు ఒక్క ఆట కూడా సరిగా ఆడింది లేదు.పైగా వారాంతంలో నాగార్జున( Nagarjuna ) వచ్చి అతని చాణక్యగా అభివర్ణిస్తూ ఉంటాడు.బిగ్ బాస్ సపోర్ట్ ఎలాగూ ఉండనే ఉంటుంది.దాంతో శివాజీ ఆ ఇంటికి పెద్దకామాందుగా వ్యవహరిస్తున్నాడు.
సరే లేనిపోని పెత్తనం ఎలాగో నెత్తికెక్కించుకున్నాడు కాబట్టి అలా కంటిన్యూ అయిపోతున్నాడు.
కానీ నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ చేతగానితనం చాలా క్లియర్ గా బయటపడింది.ఎపిసోడ్ లోకి అయితే వెళ్లడం లేదు కానీ శివాజీ పైన ఇప్పటికే అనేక ఆర్టికల్స్ మనం రాశాం.
అతడి ఆట తీరుపై మరోమారు అతడి ప్రవర్తన పై ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.ఏవిక్షన్ పాస్( Eviction Pass ) కోసం ఆడాల్సిన టైంలో శివాజీ బాల్స్ కింద పడటంతో అసహనానికి గురైన వెంటనే తన ఆటను మధ్యలోనే వదిలి వెళ్ళాడు.
ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి….ఎందుకంటే ఇదే పని ప్రశాంత్( Prashanth ) లేదా యావర్( Yawar ) చేసి ఉంటే వారిని నువ్వు అలా ఎలా చేస్తావురా అంటూ గట్టిగా అరిచేవాడు.మిగతా హౌస్ మేట్స్ చేస్తే వారికి ఇది అలవాటే అంటూ దెప్పి పొడిచే వాడు.మరి తను ఎందుకు ఆటను మధ్యలో వదిలేసినట్టు.ఇందులో పెద్ద మతలబు ఏమీ లేదు.అతనికి ఆడటానికి చేతకాలేదు అది ఒప్పుకోవడానికి మనసు రాలేదు.
దాంతో తను ఒడిపోవడానికి ప్రశాంత్ మాట్లాడటమే కారణం అని ఒక నింద వేశాడు.
అంతకు ముందు ఒక గేమ్ లో యావర్ ని సైతం బాధపెట్టి గౌతమ్ కి( Gautam ) సపోర్ట్ చేసి యావర్ కి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.నిన్న ప్రశాంత్ కూడా కొంతమేర శివాజీపై అలక వహించాడు.తన పెద్దతనం చూపించుకోవడం కోసం తన తోటి సభ్యులనే ఇంతలా బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది.
కప్పు కొట్టడానికి లేదా పెత్తనం చూపించుకోవడానికి తప్ప.ఇలా పలు సందర్భాల్లో తనదైన తెలివి తేటలు ఉపయోగించి తన గ్యాంగ్ ని ఓడించే ప్రయత్నం చేస్తాడు.
అలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు.రతిక( Rathika ) ఈ విషయం ఎప్పుడో కుండ బద్దలు కొట్టింది మరి ఇప్పటికైనా ఆ గొర్రె బ్యాచ్ అర్థం చేసుకుంటారో లేదో.