తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పటి నుండి సెంటిమెంట్ తో తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ.ఇక మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది.
ఈసారి కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది.అలాగే టిపిసిసి చీఫ్ పోస్ట్ ని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కి కట్టబెట్టి కాంగ్రెస్లో కొత్త జోష్ నింపారు.
ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్లో ఎన్నో అల్లకల్లోలాలు జరిగాయి.కానీ అవన్నీంటిని తుడిచి పెడుతూ అధిష్టానం అందరూ కలిసి పనిచేయాలని చెప్పింది.
ఇక అధిష్టానం కోరిక మేరకు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక మరొక పది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.అయితే ఈసారి ఎన్నికల్లో టికెట్ వస్తుంది అని ఆశపడిన ఆశావాహుల్లో కొంతమందికి చుక్కెదురయింది.కాంగ్రెస్లో చాలావరకు పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముతున్నారనే వార్తలు కూడా వినిపించాయి.ఇదంతా పక్కన పెడితే చాలామంది సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదు అని అసంతృప్తితో ఉన్నారు.

అయితే మిగతా పార్టీలలోకి కొంతమంది వెళ్తే ఇంకొంతమంది మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తమ వైపు ఉన్న అనుచరులను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తిరగమని దిశా నిర్దేశం చేయడం లేదు.దీంతో కాంగ్రెస్ అసంతృప్తులు పార్టీకి సపోర్ట్ చేసినట్టా లేదా అని అదిష్టానం అయోమయం లో పడిపోయింది.ఇక ఇప్పటికే హుస్నాబాద్ లో టికెట్ ఆశపడి భంగపడ్డ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో అంతగా కనిపించడం లేదు.అలాగే అద్దంకి దయాకర్,రమేష్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, మల్లు రవి( Mallu Ravi ),నెహ్రూ నాయక్, కాసుల బాలరాజు( Kasula Balaraju ) వంటి కొంతమంది సీనియర్ నాయకులు టికెట్ ఆశపడి భంగపడ్డారు.
దీంతో వీరందరినీ కాంగ్రెస్ అధిష్టానం భుజ్జగించినప్పటికీ ప్రచార కార్యక్రమాల్లో మాత్రం పాల్గొని తమ మద్దతు ఆ నియోజకవర్గాల్లో నిలబడిన నాయకులకు ఇవ్వడం లేదు.ఇక టికెట్ ఆశపడ్డ చాలామంది నాయకులకి నామినేటెడ్ పోస్టులైన ఎమ్మెల్సీ ఎంపీ వంటి పదవులు ఇస్తామని చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలకి ఆ నియోజకవర్గాల్లోని అసంతృత్తులు పాల్గొకపోవడంతో అసలు వీళ్ళు పార్టీకి సపోర్ట్ చేసినట్టా లేదా అని కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.
చివరి పది రోజుల్లో అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని కాంగ్రెస్ గెలుపుకి పాటుపడతారా లేదా అని కాంగ్రెస్ నాయకులందరూ టెన్షన్ పడుతున్నారు.మరి చూడాలి ఈ పది రోజుల్లో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతారో లేదో
.






