అలా శ్రీహాన్ తో నేను ప్రేమలో పడ్డాను.. సిరి ఆసక్తికర వ్యాఖ్యలు!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగు నుంచి 12వ వారం రవి ఎలిమినేట్ అయ్యారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

యాంకర్ రవి టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటారని భావించిన ఫ్యాన్స్ వైరల్ అవుతున్న వార్తల వల్ల నిరాశ చెందుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఎంతోమంది వీక్ కంటెస్టెంట్లు ఉండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవిని ఏ విధంగా ఎలిమినేట్ చేస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే రవి నిజంగా ఎలిమినేట్ అయ్యాడో లేదో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు కావాల్సిన వ్యక్తులను, కుటుంబీకులను స్టేజ్ పైకి పిలిచి వాళ్లు ఖుషీ అయ్యేలా చేశారు.బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇష్టమైన వస్తువులను త్యాగం చేస్తే మాత్రమే కావాల్సిన వ్యక్తులు, కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని నాగ్ మెలిక పెట్టగా సిరి శ్రీహాన్ తో మాట్లాడటానికి ఇష్టమైన బ్రేస్ లేట్ ను త్యాగం చేసింది.

చాలా రోజుల తర్వాత శ్రీహాన్ ను చూసే అవకాశం దక్కడంతో సిరి బోరున ఏడ్చారు.

Advertisement

తలెత్తి శ్రీహాన్ ను చూడలేకపోవడంతో పాటు ఏదో తప్పు చేసిన విధంగా సిరి గుంజీలు తీశారు.ఎక్కువగా ఆలోచించవద్దని ఎల్లప్పుడూ సిరితోనే ఉంటానని శ్రీహాన్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత సిరి హన్మంత్ తన ప్రేమ కథ గురించి చెబుతూ శ్రీహాన్ షార్ట్ ఫిల్మ్ విడుదలైన సమయంలో తాను అతిథిగా వెళ్లానని చెప్పుకొచ్చారు.

తన లవ్ స్టోరీకి అక్కడే పునాది పడిందని సిరి వెల్లడించారు.సిరికి తోడుగా ఉన్నందుకు షణ్ముఖ్ కు థ్యాంక్స్ అని శ్రీహాన్ కామెంట్లు చేశారు.నాగార్జున టాప్ 5లో ఎవరు ఉంటారని సిరి పేరు మొదట చెప్పకూడదని శ్రీహాన్ ను అడగగా సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలను వరుసగా ఉంచారు.

గత కొన్నిరోజుల నుంచి బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు