బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ నీ అరెస్టు చేసిన పోలీసులు..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) నీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.గజ్వేల్ ( Gajwel )మండలం కోల్గుర్ గ్రామంలో అతడు ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Bigg Boss Season Seven Winner Pallavi Prashanth Has Been Arrested By The Police-TeluguStop.com

ప్రశాంత్ ఇంటి వద్ద పోలీసులు రాగానే కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో తాను ఎలాంటి గొడవ చేయనని పోలీసులకు సహకరిస్తానని తెలియజేయడం జరిగింది.

ఆదివారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది.

అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తరువాత జరిగిన దాడులలో ఎక్కువగా పల్లవి ప్రశాంత్ పేరే బయటపడింది.

పైగా పోలీసులు ర్యాలీ చేయొద్దని హెచ్చరించినా గాని… ప్రశాంత్ సైలెంట్ గా ముందు వెళ్లిపోయి మళ్లీ వెనక్కి వచ్చి ర్యాలీ చేయడం జరిగింది.దీంతో కేసు నమోదు అయింది.

ఈ క్రమంలో ప్రశాంత్ ర్యాలీలో కారు నడిపిన డ్రైవర్లను పోలీసులు ఆల్రెడీ నిన్న అదుపులోకి తీసుకున్నారు.కాగా నేడు సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ప్రశాంత్ నీ పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube