తాజాగా తెలుగులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 షో గ్రాండ్ గా మొదలయ్యింది.తెలుగు బిగ్ బాస్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ బిగ్ బాస్ షో రానే వచ్చేసింది.
అయితే సాధారణంగా సెలబ్రిటీలు తెరపైన నవ్వుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు.కానీ తెర వెనుక కూడా అదేవిధంగా ఉంటారు అని అనుకోవడం పొరపాటే అని చెప్పవచ్చు.
చాలామంది సెలబ్రిటీల విషయంలో వారికి ఏంటి కావాల్సినంత డబ్బు ఉంది ఎంజాయ్ చేస్తుంటారు అని చెబుతూ ఉంటారు.కానీ అందరూ ఇలాగే ఉంటారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే.
ఎందుకంటే పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్క సెలబ్రిటీల వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో ఏడుపులు దాగి ఉన్నాయి.
కానీ సెలబ్రిటీలకు తెర వెనుక ఎన్ని కష్టాలు ఉన్న తెరపైకి రాగానే అవన్నీ ఒక్కసారిగా మరిచిపోయి ముఖంపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.
అయితే అటువంటి వారిలో తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరోహి రావు అలియాస్ అంజలి కూడా ఒకరు.యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అరోహి రావ్ ఆ తర్వాత అన్నిదానంగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇస్మార్ట్ న్యూస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.వరంగల్ కు చెందిన అరోహి రావ్ చిన్నతనం నుంచే కష్టాలను ఎదుర్కొందట.

చిన్నప్పటి నుంచి కష్టాలే కేరాఫ్ అడ్రస్ గా పెరిగానని, సహాయం చేస్తాము అంటూనే మాకేంటి అంటూ వెకిలి చూపులు చూసేవారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది అంజలి.ఇక తల్లి అనారోగ్యంతో చనిపోగా తండ్రి మరక పెళ్లి చేసుకొని తనను వదిలేసాడని, ఇక అప్పటినుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగినట్లు అరోహి రావు చెప్పుకొచ్చింది.మొదలుపెట్టి, షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి మరి బిగ్ బాస్ లో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.అలాగే తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు బిగ్ బాస్ షో తో అయినా తీరతాయో లేదో చూడాలి మరి.







