మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించి విజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల డైరెక్టర్ల గత సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు ఎక్కువగా ఉంటాయి.
మెహర్ రమేష్ సినిమా కథను అద్భుతంగా చెబుతారని అయితే అంతే అద్భుతంగా సినిమాను తెరకెక్కించే విషయంలో మాత్రం తడబడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని పూరీ జగన్నాథ్ అభిమానులు కోరుకుంటున్నారు.పూరీ జగన్నాథ్ తన సినిమాలలో హీరోలను కొత్తగా చూపిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

అదే సమయంలో పూరీ జగన్నాథ్ ఇతర రచయితల కథలతో సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.సరైన కథను ఎంచుకుని పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చిరంజీవి సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.చిరంజీవి ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.చిరంజీవి వారసుడు రామ్ చరణ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిరుత సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.చిరంజీవి సైతం కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించలేదనే సంగతి తెలిసిందే.మరి చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబో దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.ఫ్లాపుల్లో ఉండటం పూరీ జగన్నాథ్ కు మైనస్ గా మారిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.








