బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారితో ఈమె సుపరిచితమే.
ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే హాట్ ఫోటో షూట్ చేస్తూ విమర్శలు సైతం ఎదుర్కొంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈమె హాట్ ఫోటోస్ ఎప్పుడూ హల్చల్ చేస్తూనే ఉంటాయి.బాలీవుడ్ సినీ పరిశ్రమలో బోల్డ్ నటీమణుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది.
రకరకాల ట్రెండ్ ను ఫాలో అవుతూ డిఫరెంట్,డిఫరెంట్ స్టైల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన అందాన్ని ఆరబోస్తూ ఉంటుంది.ఎక్కువగా ఈమె డ్రెస్సింగ్ స్టైల్స్ చూసి నెటిజన్స్ షాక్ అవుతూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు అయితే ఆమెపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేస్తూ ఉంటారు.ఇక తనపై ట్రోలింగ్స్ చేసే వారికీ ఆమె కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
ఇది తరచూ సోషల్ మీడియాలో జరిగే వ్యవహారమే.ఎప్పటిలాగే తాజాగా మరొకసారి ఉర్ఫి హాట్ ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలో బ్లూ టాప్, వైట్ ప్యాంటు ను ధరించింది.ఇక బ్లూ టాప్ మీద నెట్ ధరించింది.
కొందరు ఈ ఫోటో పై పాజిటివ్ కామెంట్స్ చేయగా ఇంకొందరు మాత్రం ఆమె ధరించిన నెట్ పై కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోలో తన అందాలను చూపిస్తూ మరొకసారి రెచ్చిపోయింది.బ్లూ టాప్ ధరించి, ఎద మీదుగా నెట్ ను అలంకరించుకుంది.ఈ ఫోటో సోషల్ మీడియాలో కొద్ది సేపటిలోనే వైరల్ అవగా.కొందరు మాత్రం ఈ ఫోటో పై హాట్ కామెంట్ చేస్తున్నారు.ఒకరు అయితే ఆమె ధరించిన టాప్ ని పళ్ళ సంచితో పోల్చారు.
ఇంకొందరు అయితే చేపలు పట్టే వలలా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.ఒకరు అయితే దోమతెర ఎందుకు ధరించావని చమత్కారంగా కామెంట్ చేశారు.
ఇంకొందరు అయితే చేపలు పట్టేవారికి వాళ్ళ వల తిరిగి కావాలట అంటూ ఆట పట్టించారు.మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.