ఇండియన్ వైడ్ గా బిగ్ బాస్ గా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్స్ ని బిగ్ బాస్ కంప్లీట్ చేసుకుంది.
ఐదో సీజన్ కోసం ప్రస్తుతం కంటిస్టంట్ ల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు.
అందులో భాగంగా షూటింగ్ లకి కూడా పర్మిషన్ పూర్తిగా రద్దు చేశారు.వాటిపై కూడా నిషేధం ఉంది.
కొన్ని చోట్ల పర్మిషన్ తీసుకొని కఠిన నిబంధనల మధ్య షూటింగ్ చేస్తున్నారు.అయితే తమిళనాడులో అయితే షూటింగ్ లకి కూడా పర్మిషన్ లేదు.
అన్నింటిని పూర్తిగా నిలిపేశారు.అయితే మొహల్ లాల్ హోస్ట్ గా చేస్తున్న మలయాళీ బిగ్ బాస్ సీజన్ 3 షూటింగ్ నిబంధనలకి విరుద్ధంగా సీక్రెట్ గా చేస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయారు.
ఫిబ్రవరిలో మలయాళీ బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అయ్యింది.అయితే రెగ్యులర్ షో కావడంతో లాక్ డౌన్ తర్వాత దీనిని ఆపలేకపోయారు.అయితే తమిళనాడులో షూటింగ్ లపై పూర్తి నిషేధం ఉందని తెలిసినా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా రహస్యంగా చెన్నైలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ నిర్వహిస్తున్నారు.దీనిపై పక్కా సమాచారంతో ఆర్డీవో పోలీసులని తీసుకొని స్టూడియోకి వెళ్లి షూటింగ్ ని అడ్డుకున్నారు.
సెట్‌ని సీల్ చేసి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు కెమెరామెన్లు, టెక్నీషియన్లు అందరిని పంపించేశారు.అలాగే లక్షరూపాయిల జరిమానా కూడా విధించారు.
అలాగే నిబంధనలని అతిక్రమించి సీక్రెట్‌గా షూటింగ్ చేయడంపై నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.ఇంత జరిగిన జూన్ 4న మలయాళ బిగ్ బాస్ ఫైనల్‌ను నిర్వహించాలనే ఆలోచనతో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తుంది.