Bigg Boss Kiran Rathod : ఆ వ్యక్తి వల్ల కెరీర్ నాశనం.. యాప్ లో అలాంటి వీడియోలు.. కిరణ్ రాథోడ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss 7 ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో కిరణ్ రాథోడ్( Kiran Rathod ) ఒకరు.

టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఈ నటి తన కెరీర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాలలో నటించడం గమనార్హం.బోల్డ్ బ్యూటీగా కిరణ్ రాథోడ్ గుర్తింపును సంపాదించుకున్నారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రాథోడ్ సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత ఒక యాప్ ను( App ) మొదలుపెట్టానని ఆ యాప్ లో ఫోటోలు, హాట్ వీడియోలను షేర్ చేశానని కిరణ్ రాథోడ్ కామెంట్లు చేశారు.ఆ వీడియోల వల్ల సినిమా ఛాన్స్( Movie Offers ) దక్కుతుందని ఫీలయ్యానని ఆమె తెలిపారు.

కొంతమంది డబ్బులిస్తాం కమిట్మెంట్ ఇస్తారా అని అడిగారని కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చారు.

Advertisement

పదేపదే కాల్స్ వస్తుండటంతో ఆ యాప్ ను తర్వాత రోజుల్లో ఆపేశానని కిరణ్ రాథోడ్ వెల్లడించారు.ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను, హాట్ వీడియోలను షేర్ చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.అయితే ఇప్పుడు కూడా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని కిరణ్ రాథోడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను శృంగార సినిమాలలో నటించకపోయినా మీడియా నాపై ఆ ముద్ర వేసిందని ఆమె తెలిపారు.

చాలామంది హాట్ వీడియోలు చేస్తున్నా నాపై మాత్రమే విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చారు.గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయానని ఆ వ్యక్తి వల్ల సినిమా ఆఫర్లు సైతం మిస్ చేసుకున్నానని ఆమె అన్నారు.ఆ వ్యక్తి వల్ల కెరీర్ నాశనమైందని ఆమె కామెంట్లు చేశారు.

కిరణ్ రాథోడ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు