టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా సైబర్ నేరగాళ్లు చదువుకొని వారిని మాత్రమే కాకుండా ఎంతో విద్యావంతులను కూడా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ లక్షలకు లక్షలు చోరీ చేస్తున్నారు.
ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా నటి కీర్తి భట్( Keerthi Bhat )సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రెండు లక్షల ( Two Lakhs ) పోగొట్టుకున్నానని ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు.
అసలు ఈమె డబ్బు ఎలా పోగొట్టుకున్నారనే విషయాన్ని తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక వీడియో చేశారు.ఇందులో భాగంగా తనకు ఒక అర్జెంట్ పార్సెల్ రావాల్సి ఉండేదని రెండు రోజులకే వస్తుంది అనుకున్న ఆ పార్సెల్( Parcel ) వారం రోజులైనా రాకపోవడంతో నేను వారిని కాంటాక్ట్ అయ్యానని తెలిపారు.అయితే కొందరు వ్యక్తులు ఆ పార్సిల్ కోసమే నాకు కాల్ చేసి పార్సెల్ పంపించడానికి .మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు.కాబట్టి వాట్సాప్‌లో మీ ఫుల్ అడ్రస్ పంపించండి అని నెంబర్ పెట్టారు. అనంతరం ఈ అడ్రస్ వాట్సప్ ద్వారా వెళ్లకపోవడంతో నార్మల్ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టారు నేను కూడా రిప్లై ఇచ్చాను అలాగే ఒక లింక్ కూడా పంపించారు ఆ లింక్ నేను క్లిక్ చేయడం వల్ల అడ్రస్ అప్డేట్( Address Update ) చేసినందుకు రెండు రూపాయలు కట్ అవుతుందని చెప్పారు.
సరే రెండు రూపాయలే కదా అనేసి నేను ఆ లింక్ క్లిక్ చేశాను రెండు రూపాయలు కట్ అయినట్టు నాకు మెసేజ్ కూడా వచ్చింది అనంతరం నేను షూటింగ్ కి వెళ్ళిపోయాను అయితే ఒకసారి 99 వేలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది.తరువాత మరో 99 వేలు కట్ అయినట్టు మెసేజ్ రావడంతో వెంటనే నా అకౌంట్ చెక్ చేయగా సుమారు రెండు లక్షల డబ్బు కట్ అయినట్టు చూపించడంతో ఏం చేయాలో దిక్కుతోచగా కార్తీక్ ( Karthik )తో కలిసి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను( Cyber Crime Police ) ఆశ్రయించానని తెలిపారు.మా అదృష్టం ఏమిటంటే ఆదివారం కావడంతో ఆ డబ్బు మరో అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ కాలేదు .90% మా డబ్బు రిటర్న్ వస్తుందని పోలీసులు చెప్పారు అంటూ తను మోసపోయిన విషయాన్ని తెలియచేస్తూ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.