పొలం పని వదిలేస్తేనే వెంట వస్తానన్న యువతి.. పల్లవి ప్రశాంత్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season Seven ) చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్టు ఫినాలి రేసు జరుగుతున్న విషయం తెలిసిందే.

 Bigg Boss 7 Telugu Day 89 Episode Highlights, Bigg Boss 7, Pallavi Prashanth, Lo-TeluguStop.com

ఇక హౌస్లో కంటెస్టెంట్ లు ఒకరిని మించి ఒకరు గేమ్ లు ఆడుతూ ఎలా అయినా టికెట్ టు ఫినాలే కి వెళ్లాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇకపోతే హౌస్ లో తాజాగా ఏం జరిగింది అన్న విషయాన్ని వస్తే.

నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్( Amar, Arjun, Prashant, Gautham ) ఉన్నారు.తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్ రేసు నుంచి తప్పుకున్నాడని బిగ్ బాస్ చెప్పాడు.

Telugu Bigg Boss, Love Story-Movie

తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా అమర్ పేరు చెప్పాడు.అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్‌ తో చెప్పాడు.ఇదే విషయం గురించి శోభా, ప్రియాంకతో డిస్కస్ చేసింది.ఇకపోతే ఈ టాస్కులో భాగంగానే శివాజీ, శోభా తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు.గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల దాదాపు పెళ్లి వరకు ఒక వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.ఇక ప్రశాంత్‌ని ప్రేమకథ చెప్పాలని బిగ్‌బాస్ చెప్పమన్నాడు.

దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు.

Telugu Bigg Boss, Love Story-Movie

ఒక రోజు పొలంకి వెళ్తుంటే దారిలో ఒకే అమ్మాయి హాయ్ చెప్పింది.కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది.అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు.

దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది.వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది.

చాలా రోజుల తర్వాత ఒకే రోజు ఫోన్ చేసి పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్‌గా చెప్పింది.నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశాను.

అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు ప్రశాంత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube