పొలం పని వదిలేస్తేనే వెంట వస్తానన్న యువతి.. పల్లవి ప్రశాంత్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season Seven ) చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్టు ఫినాలి రేసు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక హౌస్లో కంటెస్టెంట్ లు ఒకరిని మించి ఒకరు గేమ్ లు ఆడుతూ ఎలా అయినా టికెట్ టు ఫినాలే కి వెళ్లాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇకపోతే హౌస్ లో తాజాగా ఏం జరిగింది అన్న విషయాన్ని వస్తే.నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్( Amar, Arjun, Prashant, Gautham ) ఉన్నారు.

తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్ రేసు నుంచి తప్పుకున్నాడని బిగ్ బాస్ చెప్పాడు.

"""/" / తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా అమర్ పేరు చెప్పాడు.

అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్‌ తో చెప్పాడు.

ఇదే విషయం గురించి శోభా, ప్రియాంకతో డిస్కస్ చేసింది.ఇకపోతే ఈ టాస్కులో భాగంగానే శివాజీ, శోభా తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు.

గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల దాదాపు పెళ్లి వరకు ఒక వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రశాంత్‌ని ప్రేమకథ చెప్పాలని బిగ్‌బాస్ చెప్పమన్నాడు.దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు.

"""/" / ఒక రోజు పొలంకి వెళ్తుంటే దారిలో ఒకే అమ్మాయి హాయ్ చెప్పింది.

కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది.అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు.

దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది.వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది.

చాలా రోజుల తర్వాత ఒకే రోజు ఫోన్ చేసి పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్‌గా చెప్పింది.

నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశాను.అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు ప్రశాంత్.

జాన‌ప‌ద గీతానికి డ్యాన్స్‌ అదరగొట్టిన మిస్టర్ కూల్.. వీడియో వైర‌ల్‌